తెలకపల్లి వ్యూస్: విద్వేషంపై విమర్శల వర్షం

నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ఎన్‌డిఎ ప్రభుత్వం ఏడాదిలోనే నిరంకుశత్వ మార్గం పట్టిందని అమెరికాలో ప్రముఖ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌, ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచి పత్రిక లేమాండే నిశితంగా విమర్శించాయి. హెచ్‌సియు ఘటనల తర్వాత ప్రధాని లండన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ మీడియాలోనూ ఇలాటి విమర్శలే. ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ప్రపంచ భ్రమణం చేయడం ద్వారా ప్రతిష్ట మోగిపోతున్నదని మోడీ చెబుతుంటే వాస్తవాలు ఇలా వున్నాయి. హెచ్‌సియు, జెఎన్‌యు ఉదంతాల తర్వాత జాతీయ మీడియా కూడా ఆయనను సమర్థించలేని పరిస్థితి ఏర్పడింది.

ఇందిరాగాంధీ నియంతృత్వం వ్యక్తిగతంగా లేక కుటుంబ పరంగా సాగితే మోడీ సంఘ్ సైద్ధాంతిక నిరంకుశత్వంగా మారిందని టైమ్స్‌ గ్రూపు సంపాదకురాలు సాగరిక ఘోష్‌ వ్యాఖ్యానించారు. ‘ఇంత అదరణ గల క్యాబినెట్‌ ఎప్పుడైనా వుందా? సృతి ఇరానీ మాటలు గొప్ప టీవీ షో కావచ్చుగాని మంత్రికి సరిపడతాయా? దాద్రి హత్యాకాండతో ఒక మహేష్‌ శర్మ వస్తారు. హెచ్‌సియు విద్యార్థులు జాతి వ్యతిరేకులని ఒక బండారు దత్తాత్రేయ చెలరేగిపోతారు. రచయితల నిరసనలు కావాలని సృష్టించినవని అరుణ్‌జైట్లీ నోరుపారేసుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్రోహుల మద్దతు వుందని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానిస్తారు. వీటిపై ఎంత దుమారం రేగినా నరేంద్ర మోడీ నోరు మెదపరు అని సాగరిక రాశారు.

ఇన్నీ చేస్తూ హిందూత్వను తీవ్రంగా వ్యతిరేకించిన అంబేద్కర్‌ను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నం చేయడం మరింత విడ్డూరమని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో దిలీప్‌ పడగోంకర్‌ రాశారు. అంబేద్కర్‌ రచనల నుంచి అనేక ఉదాహరణలు కూడా ఇచ్చారు. రామ్‌దేవ్‌కు రవిశంకర్‌కు మధ్య ఆయుర్వేద ప్రకృతి ఉత్పత్తుల అమ్మకంలో పోటీ నడుస్తుంటే – ఈ ఇద్దరితోనూ మోడీ దోస్తానా వివిధ తరగతుల భక్తులను ఆకటుకునే ఎత్తుగడేనని ప్రభుచావ్లాయే రాశారు! బావప్రకటనాస్వేచ్చపై దాడిని చాలా మంది ఖండించారు. సంఘ్ చెప్పిందే దేశభక్తి అయితే తాను దేశద్రోహి అనిపించుకోవడానికే ఇష్టపడతానని రాజ్‌దీప్‌సర్దేశాయి, బర్ఖాదత్‌ వంటివారు బాహాటంగా వ్యాఖ్యానించారు. వీరెవరూ భావజాలపరంగా వామపక్షాలకు చెందిన వారు కాదని గుర్తించడం అవసరం.

మరో వైపున ప్రసార భారతి చైర్మన్‌ ఎ.సూర్య ప్రకాశ్‌ అయితే జెఎన్‌యులో దేశద్రోహం జరిగిపోయిందని,2014 ఎన్నికల్లో దెబ్బతిన్న రెండు కమ్యూనిస్టుపార్టీలు మోడీకి వ్యతిరేకంగా చాలా కుట్రలు చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. ఈ నిస్ప్రహలో కమ్యూనిస్టులు మోడీపై ద్వేషాన్ని దేశంపై ద్వేషంగా మారుస్తున్నాయని ఆరోపించారు. ఆయన అభిప్రాయాలు ఆయనకువుండొచ్చు గాని ఈ క్రమంలో ఇందిరే ఇండియా అన్నట్టు మోడీనే భారత్‌ అనే భావం కలిగిస్తున్నానని గుర్తించకపోవడం విశేషం!

అమెరికాలో సామూహిక కాల్పులకు పాల్పడిన సయ్యద్‌ రిజ్వాన్‌ ఫరూఖ్‌ ఐ ప్యాడ్‌లో వివరాలు దేశప్రయోజనాల రీత్యా అందించమంటే ఆపిల్‌ సంస్థ అంగీకరించలేదు. దీనిపై న్యాయ వివాదం నడుస్తుండగా అద్యక్షుడు ఒబామా అప్పగించాలన్న కోర్కెను తాను బలపరుస్తానని ట్వీట్‌ చేశారు. భారత దేశంలో దేశద్రోహచట్టం 19వ శతాబ్దిదైతే అమెరికా ప్రభుత్వం 1789 నాటి ఒక చట్టం ఆధారంగా ఈ చర్యతీసుకున్నది. ఏమైనా ఇలా ఇవ్వడం స్వేచ్చకు భంగకరమని ఆపిల్‌ వాదిస్తున్నది. గూగుల్‌ సిఇవో సుందర్‌ పిచ్చరు కూడా ఇది ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తుందని వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా ఇక్కడ జాతి ద్రోహం దేశద్రోహం వంటి ఆరోపణలు రావడం లేదని టైమ్స్‌గ్రూప్‌కు చెందిన నలీన్‌ మెహతా విశ్లేషించారు. సృతి ఇరానీ మానవ వనరుల శాఖలో సహాయ మంత్రి ఆగ్రా ఎంపి రాం శంకర్‌ ఖతారియా విద్వేష వ్యాఖ్యలపై టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సంపాదకీయం రాస్తూ ఇలాటి వారిని బిజెపి అదుపులో పెట్టాలని సూచించింది. విద్యాధికులు, కొందరు యువత కూడా ఈ తరహా ప్రసంగాల ప్రభావంతో ఆవేశపడుతున్నా విద్వేషం జాతి వ్యతిరేక ముద్రలు వేయడం తగదనే ఆలోచనా పరులు విద్యావేత్తలు మీడియా వ్యాఖ్యాతలు హితవు పలుకుతున్నారు. మరి బిజెపి వీటిని మన్నిస్తుందో లేదో భవిష్యత్తు చెప్పాలి.

అంతెందుకు? అస్సాంలో ఇలాటి ప్రచారాలు బిజెపి చేసే అవకాశమే వుండదు. కాశ్మీర్‌ తర్వాత అక్కడే ముస్లిం జనాభా అక్కడే అధికం గనక వేరే ఎత్తుగడలు అనుసరించక తప్పదు. లోగడ బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన హిందూ శరణార్థులకు మాత్రం పౌరసత్వం ఇస్తామని చేసిన ప్రకటన కూడా ఇప్పుడు నష్టం చేయొచ్చని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. ప్రధాని తదితర నేతల పర్యటనల్లో దాన్ని సర్దుబాటు చేయాలని కోరుతున్నారు. కనుక అంతర్గతంగానూ బిజెపి ధోరణి సవరించుకోవలసి వస్తుంది. భిన్న మతాలు గల ఇండియా వంటి దేశంలో ఇవన్నీ అనివార్య పరిణామాలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close