పోలవరం తీర్పుపై విపక్షాలు ర్యాగింగ్..! నోరు విప్పలేకపోతున్న వైసీపీ..!

పోలవరంపై హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో.. టీడీపీ నేతలు.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాము ప్రధాని మోడీకి చెప్పే చేస్తున్నామంటూ… విజయసాయిరెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలతో.. బీజేపీ నేతలూ భగ్గమంటున్నారు. వారికి ఈ తీర్పు కలసి వచ్చింది. దాంతో.. విడివిడిగా.. టీడీపీ, బీజేపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం … రాష్ట్రానికి శనిలా పట్టిందని భావించాల్సిన పరిస్థితి వచ్చిందని.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఇతర టీడీపీ నేతలు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రాజెక్ట్‌ను న్యాయవివాదాల్లో నెట్టే ప్రయత్నం చేయుకండా.. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అస్మదీయులకు కాంట్రాక్టులను కట్టబెట్టేందుకే.. రివర్స్ టెండర్లని.. వాటిని సుప్రీంకోర్టు సస్పెండ్ చేసినందున.. ప్రభుత్వం ఇప్పటికైనా మారాలని… టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరో వైపు.. భారతీయ జనతా పార్టీ నేతలూ.. ఏ మాత్రం ఆగడం లేదు. పోలవరం తీర్పుపై… ప్రభుత్వాన్ని వారూ కార్నర్ చేస్తున్నారు. పోలవరానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం అయినా… పోలవరం ప్రాజెక్ట్ అధిరిటీ తీసుకోవాలని కానీ.. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తీసుకుని.. ఆ చెడ్డపేరును మోడీపైకి నెట్టే ప్రయత్నం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండించాలని.. హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో.. అందరూ… నేరుగానో.. సోషల్ మీడియాలోనో ఖండిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ విషయంలో కేంద్రం సూచనలను జగన్ పట్టించుకోలేదని… కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ నిర్ణయాలు తప్పని తేలిపోయిందిని మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై.. కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కన్నా లక్ష్మినారాయణ హితవు పలికారు. ఇక ఇతర బీజేపీ నేతలూ..ప్రభుత్వానికి హితబోధలు చేస్తూనే ఉన్నారు.

ఓ వైపు టీడీపీ తీవ్రమైన విమర్శలు.. మరో వైపు బీజేపీ… ఏ మాత్రం తగ్గకుండా… సూటిమాటలతో.. విరుచుకుపడుతున్నా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ.. ఆ పార్టీకి చెందిన సాక్షి మీడియా కానీ.. నోరెత్త లేకపోతోంది. కనీసం తీర్పు గురించి… సాక్షి మీడియాలో ఒక్క వాక్యం కూడా.. ప్రస్తావించలేదు. ఇక వైసీపీ నేతలు స్పందించడానికి నిరాకరిస్తున్నారు. ఏం మాట్లాడితే.. ఏం వివాదం వస్తుందోనని.. వారు ఆందోళన చెందుతున్నారు. అందుకే.. మీడియా ప్రతినిధులు కాల్ చేసినా.. స్పందించడానికి నిరాకరిస్తున్నారు. టీడీపీ, బీజేపీ నేతలు ర్యాగింగ్ చేస్తున్నప్పటికీ..వారు నోరు కట్టేసుకుని ఉంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ గతంలో… రివర్స్ టెండర్లు వద్దని చెప్పినప్పటికీ.. అనుమతి ఇచ్చిందని.. సాక్షి మీడియా ప్రచారం చేసుకుంది. పోలవరంపై హైకోర్టు తీర్పు విషయంలో ఏం చేస్తారో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close