జగన్ భయపెడుతున్నారా..? భయపడుతున్నారా..?

ఆంధ్రప్రదేశ్‌లో తమకు అనుకూలంగా వార్తలు ప్రసారం చేయడం లేదన్న కారణంగా రెండు టీవీచానళ్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిలిపి వేయించిన వ్యవహారం.. రకరకాల రాజకీయ చర్చలకు కారణం అవుతోంది ఆయన ఫ్యాక్షన్ మనస్థత్వంతో అందర్నీ బెదిరించాలనుకుంటున్నారని కొంత మంది అంటూంటే.. టీడీపీ నేతలు మాత్రం… ఆయన భయమేమిటో స్పష్టంగా తెలుస్తోందని వెటకారం చేస్తున్నారు. సీఎం గారి ఆదేశం అంటూ.. ఇద్దరు మంత్రులు.. కేబుల్ ఆపరేటర్లను పిలిపించి… చానల్‌ను నిలిపివేయాలని హెచ్చరించారు. కాదూకూడదంటే..ఏం జరుగుతుందో చెప్పి పంపించారు. అంతగా ప్రభుత్వం… ఇన్వాల్వ్ కావాల్సినంతగా… ఆ టీవీ చానళ్లు ఇప్పుడేం చేశాయో చాలా మందికి అర్థం కావడం లేదు.

నిర్బంధాలు విధిస్తూ జగన్ తప్పు మీద తప్పు చేస్తున్నారా…?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమపై ప్రజల్లో మూడు నెలల్లోనే చెప్పుకోలేనంత వ్యతిరేకత ఏర్పడిందనే భావనను ప్రజల్లో.. స్వయంగా జగనే కల్పిస్తున్నారని.. వైసీపీ నేతలు ఆందోళన కల్పిస్తున్నారు. ఇప్పటికిప్పుడు మీడియాను బ్యాన్ చేయాల్సిన అవసరం.. బలవంతంగా.. టీవీ చానళ్లను రాకుండా చేయడానికి బెదిరింపులకు పాల్పడాల్సినంత అవసరం ఏమిటన్నది చాలా మందికి అర్థం కావడం లేదు. చలో ఆత్మకూర్ కార్యక్రమం విషయంలో చేసిన తప్పులే… మళ్లీ మళ్లీ చేస్తున్నారనే భావన వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

చలో ఆత్మకూరు పై ఉక్కుపాదమే ఓ మైనస్..!

చలో ఆత్మకూరు కార్యక్రమంతో ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతే పెద్దలకు కంటగింపుగా మారినట్లుగా ఉంది. తాము చేసిన దాని వల్లే వ్యతిరేకత వచ్చిదంని.. మీడియా చూపించడం వల్ల కాదని తెలుసుకోలేని అధికారమత్తులో… ఆ వార్తలను ప్రసారం చేశారన్న కారణంగా… ఏబీఎన్ పై తమ ప్రతాపం చూపించారు. నిజానికి చలో ఆత్మకూరు కార్యక్రమం జాతీయ మీడియాలో కూడా హైలెట్ అయింది. అలా అవడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్బంధ చర్యలే కారణం. ఆ నిర్బంధాల వల్లే.. జాతీయ మీడియాలోనూ హైలెట్ అయింది. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రభుత్వంఈ సారి ఏకంగా మీడియాపైన నిర్బంధానికి పాల్పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

చూపించినందుకు మీడియాపైనా నిషేధమా..?

జగన్ మీడియాను భయపెట్టి.. ప్రజలకు అసలేం జరుగుతుందో తెలియకుండా చేద్దామని అనుకుంటున్నారని.. కానీ ప్రస్తుత డిజిటల్ విప్లవకాలంలో అదెలా సాధ్యమన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ భయ పెడుతున్నారో.. భయపడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. స్వయంగా… తప్పు మీద తప్పు చేస్తున్నారనే అంచనాకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు… అప్రజాస్వామికంగా ఉన్న తీరు.. జాతీయ మీడియాను సైతం నివ్వెర పరుస్తోంది. రాజకీయాలకు అర్థం.. పరమార్థం.. ప్రజలకు మేలు చేయడం కాకపోవచ్చేమో కానీ…కీడు మాత్రం చేయకూడదు. కానీ ఏపీలో సర్కార్ అదే చేస్తోందని.. ప్రసిద్ధ జాతీయ ఇంగ్లిష్ పత్రికలు.. ఏకంగా ఎడిటోరియల్స్ రాసే పరిస్థితి వచ్చింది. అధికార మత్తును.. దింపేసి.. జగన్ వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేసుకోకపోతే… పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది. భయపెట్టడం సంగతేమో కానీ.. భయపడుతున్నారనే భావన పెరిగిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాపం వైసీపీ – కోడ్ వచ్చాక పెయిడ్ సర్వేలూ ప్లేట్ ఫిరాయింంపు !

ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి....

రెడ్డి గారి “మేఘా” క్విడ్ ప్రో కో !

1989లో సిమెంట్ పైపులు తయారు చేసే కంపెనీ మేఘా ఎంటర్ ప్రైజేస్. పి. పిచ్చిరెడ్డి దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆ కంపెనీ రాజకీయ పార్టీలకు రెండున్నర...

దానంపై అనర్హతా వేటుకు బీఆర్ఎస్‌ ఫిర్యాదు – పాతవన్నీ గుర్తుకు రావా ?

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ తరపున గెలిచినందున ఆయనపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇంకెవరూ లేనట్లుగా పాడి కౌసిక్ రెడ్డి...

రోజాను బూతులు తిట్టిన బండారుకు వైసీపీ ఎంపీ టిక్కెట్ ?

వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీసీకి ఇస్తున్నామని కులం పేరు ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీగా హ్యాండిచ్చినట్లుగా స్పష్టమయింది. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close