విపక్షాల స‌మావేశం ఫ‌లితాల ముందా… త‌రువాతా..?

ఈనెల 21న విపక్షాల‌న్నీ ఢిల్లీలో స‌మావేశం పెట్టాల‌ని భావించాయి. ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు రెండు రోజులు ముందు జ‌రిగే ఈ స‌మావేశం కీల‌క‌మైన రాజ‌కీయ ప‌రిణామంగా మారే అవ‌కాశం ఉంది. అయితే, ఆ రోజున ఈ స‌మావేశం ఉంటుందా లేదా అనే ఉత్కంఠ నెల‌కొంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప‌శ్చిమ బెంగాల్ వెళ్లిన ఏపీ సీఎం చంద్ర‌బాబు, మ‌మ‌తా బెన‌ర్జీతో ఇదే అంశ‌మై చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందు, ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి కూడా… ఈ స‌మావేశంపైనే ప్ర‌ధానంగా చ‌ర్చించి‌న‌ట్టు స‌మాచారం. ఫ‌లితాల‌కు ముందే విప‌క్షాల‌న్నింటినీ ఒక వేదిక మీదికి తీసుకొస్తే బాగుండు అనేది చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న‌. అయితే, ఫ‌లితాలు వ‌చ్చాక‌నే ఈ స‌మావేశం ఉంటే మంచిది అనేది మ‌మ‌తా బెన‌ర్జీ అభిప్రాయంగా తెలుస్తోంది.

ఇదే విష‌య‌మై ఏపీ సీఎం చంద్ర‌బాబుతో ఆమె చర్చించార‌నీ, ఫ‌లితాల ముందుగానే స‌మావేశం అంటే కొన్ని పార్టీలు గైర్హాజ‌రు అయ్యే అవ‌కాశం ఉంద‌నీ, ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేస్తే ప‌రిస్థితులు చాలా స్ప‌ష్టంగా అన్ని పార్టీల‌కూ అర్థ‌మైపోతుంద‌నీ, అప్పుడు స‌మావేశం పెట్టుకుంటే బాగుంటుంద‌ని మ‌మ‌తా అభిప్రాయ‌ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. ప్ర‌భుత్వ ఏర్పాటుపై ఉండే సాధ్యాసాధ్యాల‌ను కూడా అప్పుడు చ‌ర్చించుకునే అవ‌కాశం ఉంటుంది క‌దా అనేది దీదీ అభిప్రాయం. మ‌మ‌తా అభిప్రాయంలో కొంత వాస్త‌వం కూడా ఉండ‌టంతో చంద్ర‌బాబు కూడా దీనిపై ఆలోచిస్తున్నార‌ట‌. దీంతో ఈ నెల 21న జర‌గాల‌నుకున్న స‌మావేశం వాయిదా ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

వాస్త‌వానికి ఈ స‌మావేశం ముందుగానే జ‌ర‌గాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది! ఎందుకంటే, ఎన్నిక‌ల ఫ‌లితాల‌కంటే ముందుగానే కొన్ని పార్టీలు గ్రూపుగా ఏర్ప‌డి, కూట‌మి క‌ట్టామ‌ని రాష్ట్ర‌ప‌తికి చెప్పాలి. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత‌.. ఏ పార్టీకీ సొంతంగా మెజారిటీ రాని ప‌రిస్థితి ఏర్ప‌డితే… ప్రీపోల్ అల‌యెన్స్ లో ఉన్న కూట‌మికి ఎక్కువ స్థానాలు ఉన్న‌ట్ట‌యితే, ఆ కూట‌మిని ముందుగా ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవ‌కాశం ఉంటుంది. భాజ‌పాకి ఎలాగూ సొంతంగా పెద్ద సంఖ్య‌లో సీట్లు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో, ఆ పార్టీ కూడా భాగ‌స్వామ్య ప‌క్షాల సంఖ్య‌ను పెంచుకునేందుకే ప్ర‌య‌త్నిస్తుంది. ఈ నేప‌థ్యంలో, ఫ‌లితాలు ముందుగానే ఒక వేదిక మీదికి విప‌క్షాలు వ‌చ్చేస్తే మంచిది అనేది చంద్ర‌బాబు ఆలోచ‌న‌గా చెప్పుకోవ‌చ్చు. 21న జ‌ర‌గాల్సిన స‌మావేశం జ‌రిగితేనే మంచిదనే అభిప్రాయం విశ్లేష‌కులు వ్య‌క్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close