రివ్యూ : ఆర్గానిక్‌ మామ.. హైబ్రిడ్‌ అల్లుడు

Organic Mama Hybrid Alludu Movie Telugu Review

రేటింగ్‌: 2/5

ఎస్వీ కృష్ణారెడ్ఢి.. ఈ పేరు వినగానే మాయలోడు, యమలీల, మావిచిగురు, శుభలగ్నం, పెళ్లి పీఠలు, పెళ్ళాం ఊరెళితే.. ఇలా వినోదాత్మక కుటుంబ కథా చిత్రాలన్నీ గుర్తుకువస్తాయి. చిన్న సినిమాలతో వరసుగా పెద్ద విజయాలు సొంతం చేసుకున్న దర్శకుడాయన. అయితే ఆయన నుంచి సినిమాలు రావడం తగ్గిపోయింది. పదేళ్ళ క్రితం యమలీలకు సీక్వెల్ గా ఓ సినిమా చేశారు. కానీ అది పెద్దగా ఆడలేదు. దీని తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. దాదాపు పదేళ్ళ తర్వాత ఇప్పుడు ఆయన మళ్ళీ మెగాఫోన్ పట్టుకొని ‘ఆర్గానిక్‌ మామ.. హైబ్రిడ్‌ అల్లుడు’ అనే సినిమా తీశారు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి వినోదాల్ని పంచారు? ఎస్వీ కృష్ణారెడ్ఢి వింటేజ్ మార్క్ ఇందులో కనిపించిందా ?

వెంకటరమణ (రాజేంద్రప్రసాద్‌) వంద ఎకరాల ఆసామి. తన భూమిలో ఆర్గానిక్ పంటలు పండించడం అతని వ్యాపారం. వెంకటరమణ భార్య శాకుంతుల(మీనా). వీరికి ఒక్కగాని ఒక్క కూతురు హాసిని (మృణాళిని రవి) కూతురిని ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు వెంకటరమణ. కావాల్సింది సమకూర్చి పెడతాడు. తన కూతురుని చేసుకోబోయేవాడు కూడా తనఅంత ప్రేమ, సమర్దత వుండేవాడు కావాలనేది వెంకటరమణ ఆశయం. విజయ్ (సోహెల్‌) రెండు ప్లాప్ సినిమాలు తీసిన దర్శకుడు. విజయ్ తల్లితండ్రులు కొండపల్లి బొమ్మలు చేసుకొని జీవితం గడుపుతుంటారు. విజయ్ ని తొలి చూపులోనే ప్రేమించేస్తుంది హాసిని. వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన వెంకటరమణ ఏం చేశాడు ? కూతురిని ప్రేమని అంగీకరించాడా లేదా ? అనేది మిగతా కథ.

ఎస్వీ కృష్ణారెడ్ఢి సినిమాల్లో ఒక పాయింట్ వుంటుంది. ఆ పాయింట్ చుట్టూ ఆసక్తికరమైన సన్నివేశాలు అల్లుకొని ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా వినోదాలు పంచడం ఆయన ప్రత్యేకత. ఇన్నాళ్ళ తర్వాత ఆయన నుంచి సినిమా వస్తుందంటే.. అలాంటి ఏదైనా ఒక మంచి పాయింట్ కుదిరిందని అనుకోవడం సహజం. ఆర్గానిక్‌ మామ.. హైబ్రిడ్‌ అల్లుడు లో కూడా ఒక పాయింట్ వుంది. ‘’రిచ్ నెస్ అనేది డబ్బులోనో ఆస్తిలోనో వుండదు. అది మనిషి వ్యక్తిత్వంలో వుంటుంది’’ ఇది ఈ కథలో ఆయన చెప్పాలనుకున్నా పాయింట్. అయితే ఈ పాయింట్ వదిలేసి… పాయింట్ కి అవసరం లేని సన్నివేశాలని పేర్చుకుంటూ వెళ్లారు. దీంతో ఇటు ఎమోషన్ అటు హ్యుమర్ .. రెండూ కనెక్ట్ కాలేదు.

ఎస్వీ కృష్ణారెడ్ఢి కథలు ఎప్పుడూ నేల విడిచి సాము చేయవు. కానీ ఇందులో మాత్రం కథ అసలు నేల మీదే నిలబడలేదు. హీరోకి అనవసరమైన బిల్డప్ లు ఇచ్చి ఒక ఫైటు ఒక పాట అన్నట్టుగా తీసుకువెళ్లారు. హీరోయిన్ ని అల్లరి చేస్తున్న ఓ గ్యాంగ్ ని హీరో కొట్టడం.. రొటీన్ రొట్ట కొట్టుడు సినిమాల్లో కూడా ఇప్పుడు వాడటం లేదు. ఎస్వీ మాత్రం ఇరవై ఏళ్ల నాటి ఆ ఫార్ములా తీసుకొచ్చి ఏకంగా రెండు ఫైట్లు పెట్టారు. కొండపల్లి బొమ్మల్ని అమ్మిన ట్రాక్ తో పాటు హీరో హీరోయిన్ ల లవ్ ట్రాక్ కూడా రొటీన్ వ్యవహారంలానే వుంటుంది. అసలు ఇంటర్వెల్ బాంగ్ లో కానీ ఈ కథలో సంఘర్షణ అనేది ఏమిటో ప్రేక్షకుడికి అర్ధం కాకుండా వుంటుంది.

విరామం తర్వాత కూడా ఈ కథ ముందుకు వెళ్ళదు. రెండు పెళ్లి చూపులు, అజయ్ ఘోష్ ని బురుడీ కొట్టించే సీక్వెన్స్ ని సుదీర్ఘంగా నడిపి.. కథని క్లైమాక్స్ కి తీసుకొచ్చేస్తారు. కథలో కీలకంగా వున్న వెంకటరమణ పాత్ర సడన్ గా మారిపోయి పెళ్లి అంగీకరించడం, విజయ్ సినిమా హిట్ అయిపోవడం, నిర్మాత డబ్బులు కుమ్మరించేయడం.. ఇవన్నీ చాలా కృత్రిమంగా వుంటాయి. పైగా క్లైమాక్స్ కూడా చాలా కృత్రిమంగా తయారైయింది. కమర్షియల్ సినిమా, ఆర్ట్ సినిమా, హార్ట్ సినిమా అంటూ హీరో ఇచ్చిన స్పీచ్ విచిత్రంగా వుంటుంది. ఇందులో మెచ్చుకోవాల్సిన విషయం ఏదైనావుందంటే.ఎక్కడా ద్వంద అర్ధాలు లేకుండా సినిమాని చాలా డీసెంట్ గా తీశారు. ఈ విషయంలో ఎస్వీ అభినందించాలి.

సోహెల్ హుషారుగా చేశాడు. అతని ఫైట్ల డ్యాన్సులు కూడా బావున్నాయి. అయితే ఈ కథలో ఫైట్లు కోరుకోడు ప్రేక్షకుడు దీంతో ఆ యాక్షన్ వ్యవహారం ఆర్గానిక్ గా లేదు. మృణాళిని రవి స్క్రీన్ ప్రజన్స్ బావుంది. కానీ ఆ పాత్రని అంత బలంగా తీర్చిదిద్దలేదు. ఏ పాత్రనైనా ఆర్గానిక్ గా చేయడం రాజేంద్రప్రసాద్ కు అలవాటు. కానీ దర్శకుడు ఆయన పాత్రని తీర్చిదిద్దిన విధానంలో కాస్త అతి కూడా కనిపిస్తుంది. ప్రతిసారి రూమ్ లోకి వెళ్లి తలుపువేసుకునే మేనరిజం వర్క్ అవుట్ కాలేదు. మీనా భర్తకు క్లాసులు పీకే పాత్రలో కనిపిస్తుంది. ఒక దశ తర్వాత మీనా కనిపిస్తే మళ్ళీ క్లాసు పీకుతుందేమో అనే భయం ప్రేక్షకుల్లో కలుగుతుందంటే అర్ధం చేసుకోవచ్చు ఆ పాత్ర నైజం. అజయ్ ఘోష్ ట్రాక్ ఓకే అనిపిస్తుంది కానీ దాన్ని మరింత షార్ఫ్ గా తీయాల్సింది. సునీల్ పాత్ర కొన్ని చోట్ల నవ్విస్తుంది. కొన్ని చోట్ల మరీ ఇంత మంచి నిర్మాతలు ఉంటారా ? అనిపిస్తుంది. వరుణ్ సందేశ్, రష్మీ గెస్ట్ ఎప్పిరియన్స్ ఇచ్చారు. సప్తగిరి, ప్రవీణ్, పృధ్వి, కృష్ణ భగవాన్ నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.

కృష్ణా రెడ్డి అందించిన పాటల్లో వింటేజ్ మెరుపు కనిపించలేదు. పాటలని డీసెంట్ గా చిత్రీకరించారు. నేపధ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. రామ్ ప్రసాద్ కెమరా కలర్ ఫుల్ గా వుంది. ఎడిటర్ ఇంకా షార్ఫ్ చేసే అవకాశం వుంది. ‘రూపాయిల్లో లెక్కపెట్టేది ఆస్తి. లెక్కపెట్టలేనిది సంస్కారం’ అనే మాట బావుంది.
ఈ సినిమాలో హీరోది ఓ దర్శకుడు పాత్ర. కథ లేకుండానే హిట్టు సినిమా తీసేస్తాడు. దాన్ని కమర్షియల్ సినిమా కేటగిరీలోకి చేర్చేస్తాడు. ఒకప్పుడు ఎన్నో మంచి కుటుంబకథా చిత్రాలు అందించిన ఎస్వీ కృష్ణారెడ్ఢి.. ఇప్పటి సినిమాలకు పెద్ద కథ అవసరం లేదనుకొని ఈ ప్రయత్నం చేసినట్లు వున్నారు. ఇది విఫల ప్రయత్నం. ఎప్పటికీ గెలిచేది నిలిచేది మంచి కథే. ఆ కథే ఇందులో లోపించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close