ఇండియాలో ఉండాలంటే హిందీ నేర్చుకోవాల్సిందే అంటున్న అమిత్ షా

ఒకే దేశం – ఒకే భాష అంటూ.. హిందీపై అమిత్ షా… చేసిన వ్యాఖ్యలు …. హిందీ మినహా ఇతర భాషలు మాట్లాడే రాష్ట్రాల్లో మంటలు రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ ప్రజలందరూ విధిగా హిందీ నేర్చుకోవాలన్నట్లుగా ఆయన ..మాట్లాడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశానికి తనదైన గుర్తింపు ఉండాలంటే అందరికీ ఓ భాష తెలిసి ఉండడం అవసరమని.. హిందీ దివస్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా తేల్చేశారు. దేశాన్ని ఐక్యంగా ఉంచగల భాష ఏదైనా ఉందంటే అది అత్యధికంగా మాట్లాడే హిందీ మాత్రమేనని తన చాయిస్ కూడా చెప్పేశారు. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కలలు గన్న ‘‘ఒకే దేశం, ఒకే భాష’’ నినాదాన్ని నిజం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అమిత్ షా ఇలా మాట్లాడగానే… అలా దక్షిణాది రాష్ట్రాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. దక్షిణాది నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే అధినే స్టాలిన్ ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దిదే ఊరుకునేది లేదని అమిత్ షాకు స్పష్టం చేశారు. కాగా, అమిత్ షా వ్యాఖ్యలపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి కూడా ఖండించారు. హిందీని దక్షిణాదిలో తప్పని సరి చేయడాన్ని తమిళులు అంగీకరించరని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు.. రెండో సారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత… ఒకే నినాదం వినిపిస్తున్నారు. అందులో మొదటి వాక్యం ఒకే దేశం… రెండో వాక్యం.. మాత్రం సందర్భానికి తగ్గట్లుగా మారుతున్నారు. ఒకే ఎన్నిక, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా.. ఇలా… సందర్భాన్ని బట్టి.. అన్నీ ఒకటే ఉండాలని అంటున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు… భాష కూడా చేరింది. ఒకే దేశం – ఒకే భాష అని నినాదం ప్రారంభించారు.

మిగతా వాటి చోట్ల ఏమో కానీ.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం.. ఈ వ్యవహారం సెంటిమెట్ గా మారే ప్రమాదం ఉంది. బలవంతంగా హిందీని తమపై రుద్దుతున్నారని.. తమ మాతృభాషలు ప్రమాదంలో పడతాయని దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందడం ఖాయం. రాజకీయ పార్టీలు ముందుకు వస్తే.. అవి పోరాటాలుగా మారుతాయి. సెంటిమెంట్ అస్త్రాలుగా మారుతాయి. ఇప్పటికే ఎన్నార్సీ పేరుతో అసోంలోని కొంత మంది పౌరులను.. పౌరసత్వం నిరూపించుకోవాలన్నట్లుగా ..త్వరలో.. హిందీ టెస్టులు పెట్టి… భారతీయులో కాదో … జాబితాలు రిలీజ్ చేసే పరిస్థితి వస్తుందన్న చర్చలు కూడా అప్పుడే సోషల్ మీడియాలో ప్రారంభమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కరోనా మరణమృదంగం..! ఆపడానికి ప్రయత్నాల్లేవా..?

ఆంధ్రప్రదేశ్‌లో మరణాలు రెండు వేలు దాటిపోయాయి. గత రెండు రోజులుగా.. రోజుకు కొద్దిగా తక్కువగా వంద మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ అనేది ప్రాణాంతకం కాదని... చికిత్స చేస్తే పోతుందని ప్రభుత్వం...

“అప్పడం వ్యాక్సిన్” కనిపెట్టిన కేంద్రమంత్రికే కరోనా..!

కరోనా వైరస్‌కు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల దగ్గర్నుంచి భారతీయ జనతా పార్టీ నేతల వరకూ..అందరూ.. మందు కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. సైంటిస్టులు ఇంకా కుస్తీలు పడుతున్నారు కానీ.. భారతీయ జనతా పార్టీ...

టీటీడీపై కరోనా పడగ..! బ్రహ్మోత్సవాలు ఎలా..?

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల్లో 743 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురిలో ఓ అర్చకుడు కూడా ఉన్నారు. అర్చకుల్లో సగం మందికిపైగా వైరస్ బారిన...

తప్పు యాజమన్యాలది .. పరిహారం మాత్రం ప్రజల సొమ్మా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా హై ప్రోఫైల్ ప్రమాదం జరిగితే ముందుగా... భారీగా నష్ట పరిహారం ప్రకటించడానికి ఉత్సాహపడుతోంది. ముందూ వెనుక ఆలోచించకుండా.. ఎంత మంది చనిపోయారో తెలియకుండానే.. ఆ ప్రమాద వార్త హైలెట్...

HOT NEWS

[X] Close
[X] Close