పాకిస్తాన్ కు పీడకలలు వస్తున్నాయి. తమ ఆర్మీ బేస్‌లపై భారత్ విసిరిన బ్రహ్మోస్ మిస్సైల్స్ దాడి చేస్తున్నట్లుగా ఉలిక్కి పడుతున్నారు. ఇప్పటికే ధ్వంసం అయిన పదకొండు ఎయిర్ బేస్‌లను బాగు చేయించుకోవడానికి అప్పులు ఎక్కడ తెచ్చుకోవాలో తెలియక తంటాలు పడుతున్నారు. మిగిలిన ఆర్మీ ఇన్ ఫ్రా కూడా దెబ్బతింటే మొదటికే మోసం వస్తుంది. తాలిబన్లు, బలూచిస్తాన్‌లు కూడా వదిలి పెట్టరు. అందుకే పాకిస్తాన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది.
పాకిస్తాన్ తమ ఆర్మీ హెడ్ క్వార్టర్ ను రావుల్ఫిండి నుంచి ఇస్లామాబాద్ కు మార్చేసుకుంది. రావుల్ఫిండి భారత్ మిస్సైళ్లకు చాలా అనువుగా ఉంది. అందుకే ఆపరేషన్ సిందూర్ లో భాగంగా అక్కడా మిస్సైళ్లు పడ్డాయి. అక్కడి నుంచి డ్రోన్లను భారత్ పైకి పంపేందుకు ఆదేశాలు ఇస్తున్న ఆర్మీ చీఫ్ మునీరా..దెబ్బకు బంకర్ లోకి పారిపోయాడు. మూడు రోజుల పాటు బయటకు రాలేదు.
ఇస్లామాబాద్ అయితే..కాస్త సేఫ్ గా ఉంటుందని పాక్ ప్రభుత్వం, ఆర్మీ ఓ అభిప్రాయానికి వచ్చింది. అక్కడి ఎయిర్ బేస్ కాస్త బెటర్ గా ఉంది. అందుకే రావుల్ఫిండి నుంచి అన్నీ ఖాళీ చేసుకుని మెల్లగా ఇస్లామాబాద్ కు పోతున్నారని అంతర్జాతీయ మీడియా ప్రకటిస్తోంది.