ఉగ్రవాదుల కోసం యుద్ధానికి దిగింది పాకిస్తాన్. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తే తమపైనే దాడులు చేశారని భారత్ పై ఎటాక్ చేసింది .భారత్ రివర్స్ ఎటాక్ చేయడంతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కోల్పోయింది.అయితే రాత్రికి డ్రోన్లతో పాక్ సరిహద్దు పట్టణాలపై దాడులు చేసింది.జమ్మూ,పఠాన్ కోట్, జైసల్మీర్ వంటి నగరాలపై డ్రోన్లతో దాడులు చేసింది. ఫైటర్ జెట్లను కూడా భారత్ మీదకు పంపించింది. అప్రమత్తంగా ఉన్న సైన్యం..ఆ డ్రోన్లు లక్ష్యాన్ని చేరకుండానే గాల్లోనే పేల్చి వేశాయి. మిసైళ్లను నిర్వీర్యం చేశాయి. ఆకాశంలోనే నిర్వీర్యం అయిపోయిన పాకిస్తాన్ డ్రోన్ల దృశ్యాలు వైరల్ అయ్యాయి.
రెండు ఎఫ్ 16 యుద్ధ విమానాల్ని భారత్ కూల్చివేసింది.ఓ పైలట్ భారత ఆర్మీకి చిక్కాడు. మరో రెండు చైనీస్ తయారీ యుద్ధ విమానాల్ని భారత్ కూల్చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక్క జెట్ లేదా డ్రోన్ వెనక్కి పోలేదు. అన్నింటిని కూల్చేశారు.ఆ తర్వాత భారత్ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది. లాహోర్, ఇస్లామాబాద్, సియాల్ కోట్ లపై దాడులు ప్రారంభించింది. దీంతో పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. పాక్ నిర్వాకాన్ని ముఖ్యమైన దేశాలకు సమాచారం ఇచ్చిన భారత్.. తాము ఎదురుదాడి చేస్తున్నామని చెప్పింది.
పాకిస్తాన్ ఎటాక్ ను నిర్వీర్యం చేసిన వెంటనే.. ఆయా నగరాల్లో కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. కానీ పాకిస్తాన్ మొత్తం బ్లాక్ అవుట్ అయిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ వైపు భారత డ్రోన్లు, యుద్ధ విమానాలు జోరుగా వెళ్లి బాంబులు వేసి వస్తున్నాయి. పాకిస్తాన్ కోరుకున్న యుద్ధాన్ని భారత్ ఇస్తోంది. దాని పరిణామాల్ని వారు అనుభవించాల్సి ఉంటుంది. ఇది ఇంతటితో ఆగే అవకాశం లేదు. యుద్ధం కోరుకున్న పాకిస్తాన్ కు విధ్వంసం ఎలా ఉంటుందో చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.