పాకిస్తాన్ స్వయంగా సంక్షోభంలో కూరుకుపోయి, పొరుగు దేశాలను కూడా అదే బాటలోకి లాగుతోంది “తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్లు” అన్న చందంగా, పాక్ తన కుటిల నీతితో బంగ్లాదేశ్‌ను భారత్‌పై ఉసిగొల్పుతూ, ఆ దేశ భవిష్యత్తును పణంగా పెడుతోంది. అక్కడి నేతలు పాక్ కుట్రలో భాగమైపోతున్నారు.
బంగ్లా క్రికెట్ ఇప్పటికే ఆత్మహత్య?
దక్షిణాసియాలో క్రీడలు, ముఖ్యంగా క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, అదొక భారీ ఆర్థిక వనరు. అయితే, భారత్‌పై ఉన్న ద్వేషంతో పాకిస్తాన్ పన్నుతున్న వ్యూహాలకు బంగ్లాదేశ్ చిక్కుకుంటోంది. రాజకీయ కారణాలతో భారత్‌తో క్రికెట్ సంబంధాలను తెంచుకునేలా బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టడం ద్వారా, ఆ దేశ క్రికెట్ బోర్డు వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. ఐసీసీ నుంచి వచ్చే నిధులు, ద్వైపాక్షిక సిరీస్‌ల ద్వారా వచ్చే స్పాన్సర్‌షిప్‌లు భారత్‌తో ముడిపడి ఉన్నాయని తెలిసి కూడా, పాక్ ట్రాప్‌లో పడి బంగ్లాదేశ్ తన సొంత గొయ్యి తాను తవ్వుకుంటోంది.
పాక్ ద్వంద్వ నీతి.. బంగ్లా అమాయకత్వం
ఇక్కడ విచారకరమైన విషయం ఏమిటంటే, పాకిస్తాన్ ఒకవైపు బంగ్లాను రెచ్చగొడుతూనే, మరోవైపు తాను మాత్రం భారత్‌తో ఏదో ఒక రకంగా క్రికెట్ ఆడేందుకు, ఐసీసీ టోర్నీల్లో పాల్గొనేందుకు పాకులాడుతుంటుంది. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా, రాజకీయంగా సంక్షుభిత దేశంగా ముద్ర పడిపోయింది. అక్కడ కొత్తగా నష్టం జరగడానికి ఏమీ లేదు. కానీ బంగ్లాదేశ్ పరిస్థితి వేరు. గత దశాబ్ద కాలంగా వృద్ధి రేటులో దూసుకుపోతూ, అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోబోతున్న బంగ్లాదేశ్, ఇప్పుడు ఇలాంటి మతపరమైన, రాజకీయ ప్రేరేపిత ద్వేషాల్లో తలదూర్చడం వల్ల తన పురోగతిని తానే అడ్డుకుంటోంది.
ఆర్థిక మూల్యం చెల్లించక తప్పదా?
భారత్‌పై ద్వేషం చూపిస్తూ క్రికెట్ ఆపడం వల్ల భారత్‌కు వచ్చే నష్టం శూన్యం. ఎందుకంటే భారత క్రికెట్ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ బంగ్లాదేశ్‌కు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మాత్రమే కాదు, క్రికెట్ పరంగా కూడా ప్రధాన ఆదాయ వనరు. పాకిస్తాన్ మాటలు విని భారత్‌కు వ్యతిరేకంగా అడుగులు వేస్తే, అంతర్జాతీయ వేదికలపై బంగ్లాదేశ్ ఒంటరి అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆ దేశంలో జరుగుతున్న అంతర్గత రాజకీయ పరిణామాలు ఇన్వెస్టర్లలో భయాన్ని కలిగిస్తుండగా, ఇప్పుడు క్రీడాపరమైన వివాదాలు ఆ దేశ బ్రాండ్ ఇమేజ్ను మరింత దెబ్బతీస్తున్నాయి.
మేల్కొనాల్సిన సమయం
బంగ్లాదేశ్ తన ఉనికిని చాటుకోవాలంటే పాకిస్తాన్ నీడ నుంచి బయటపడటం అత్యవసరం. పొరుగు దేశమైన భారత్‌తో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించకుండా, పాక్ పన్నుతున్న కుతంత్రాలకు బలికావడం ఆ దేశ ప్రజలకే నష్టం. రాజకీయ ప్రయోజనాల కోసం దేశాభివృద్ధిని, యువత ఆశయాలను తాకట్టు పెట్టడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. బంగ్లాదేశ్ పాలకులు ,క్రీడా పెద్దలు వాస్తవాలను గ్రహించి, పాక్ ట్రాప్ నుంచి బయటపడినప్పుడే ఆ దేశంలో మళ్లీ కళ వస్తుంది. లేకపోతే పాక్ లాగే ఆకలి దప్పులతో బతకాల్సిందే.
