చేసింది తప్పుడు పని.. అందులోనూ సమర్థించుకోక తప్పని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదం కోసం దేశాన్ని పణంగా పెట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది. రెండు, మూడు రోజులకే తీవ్రమైన సైనిక, ఆర్థిక నష్టాన్ని చూసింది. ఇంకా కొనసాగిస్తే.. దివాలా తీయడం ఖాయమని అర్థమైపోయింది. అందుకే కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చేశారు.
మరి బారత్ ఎందుకు అంగీకరించింది ?. ఇక్కడ భారత్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహిరంచింది. పెహల్గాం లాంటి ఉగ్రవాద ఘటనలు చేపడితే పరిస్థితి ఎంత తీవ్రం గా ఉంటుందో చేతల్లో చూపించింది. వంద మందికిపైగా ఉగ్రవాదుల్ని చంపేసింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేసింది. ఆర్థికంగా కట్టడి చేసింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ పూర్తిగా కుదేలు అయింది. అయితే అదే సమయంలో భారత్‌కూ కొంత నష్టం జరిగింది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగే ప్రయత్నంలో ఉన్న భారత్ .. ఇలాంటి అవాంఛనీయమైన పరిస్థితుల్ని ఎక్కువ రోజులు కొనసాగించనీయకూడదు. అందుకే పాకిస్తాన్ కాళ్ల బేరానికి రాగానే.. ఓకే చెప్పింది.
ఇప్పుడు ఆర్మీ జనరల్స్ స్థాయిలో చర్చలు జరుగుతాయి. గతంలో చర్చలు ఆగిపోయాయి. భారత్ ఈ కాల్పుల విరమణకు అంగీకరించే ముందు విధాన పరంగాఓ కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్ ఇకపై ఉగ్రవాద దాడులు జరిగితే.. అవి యుద్ధ దాడులుగానే భావించి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. పాకిస్తాన్ ట్రైన్ అయిన జర్నలిస్టులు కశ్మీర్ కో.. మరో చోటకో వచ్చి దాడులు చేస్తే పాకిస్తాన్ చేసిన యుద్ధంగానే భావిస్తామని కేంద్రం తేల్చింది. దీనికి పాకిస్తాన్ అంగీకరించింది. అందుకే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
పాకిస్తాన్ కు ఇప్పుడు ఉగ్రవాదుల్నికాపాడటం కాదు.. తమ దేశం చీలకుండా చూసుకోవడం కీలకం. బలూచిస్తాన్ లో .. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పట్టు సాధించింది. అక్కడ వందల మంది సైనికులు చనిపోతున్నారు. ఈ దశలో పాకిస్తాన్ కు మరో ఆప్షన్ లేకుండా పోయింది. తెగేదాకా లాక్కోకుండా… కాళ్ల బేరానికి వచ్చేసింది.