సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లి అక్కడ సైన్యానికి చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్‌ను పాకిస్తాన్ విడుదల చేసింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ పాక్ సైన్యానికి చిక్కారు. కిసాన్ డ్యూటీలో ఉన్న జవాన్ అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి ఒకటిన్నర మీటర్లు వెళ్లారు. అక్కడ పాక్ జవాన్లు పూర్ణమ్ కుమార్ ను పట్టుకున్నారు. తన వద్ద ఉన్న సర్వీస్ రైఫిల్ AK-47 ను స్వాధీనం చేసుకున్నారు.
సరిహద్దుల్లో సాగు చేసే రైతులకు రక్షణగా ఉండేందుకు కిసాన్ డ్యూటీలు వేస్తారు. తమ జవాన్ ను అప్పగించాలని బీఎస్ఎఫ్ అధికారులు పాకిస్థాన్ రేంజర్స్‌తో ఫ్లాగ్ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ లోపు ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలోకి వెళ్లడంతో ఏ నిర్మయం తీసుకోలేదు. ఇప్పుడు కాల్పుల విరమణ జరగడంతో పాటు జనరల్స్ స్థాయి చర్చలు జరుపుతుతున్నారు.
పరిస్థితులు సద్దుమణుగుతూండటంతో పాటు రాజస్థాన్ సరిహద్దులో బీఎస్ఎఫ్ ఒక పాకిస్థాన్ రేంజర్‌ను అదుపులోకి తీసుకుంది. దీంతో, సాహు విడుదల కు పరస్పర విడుదల అవకాశం ఉందని లభించింది. జవాన్ సురక్షితంగా విడుదల కావడంతో బెంగాల్ లోని ఆయన కుటుంబం సంతోషంగా ఉంది. మొత్తం ఇరవైరోజుల పాటు పాకిస్తాన్ చెరలో జవాన్ ఉన్నారు.