భారత్ ప్రణాళికాబద్దంగా చేస్తున్న యుద్ధ సన్నాహాలతో పాకిస్తాన్ కంగారు పడుతోంది. సైనిక చర్యలు భారత్ తీసుకోకుండా రష్యా నుంచి ఐక్య రాజ్యసమితి వరకూ తనకు అంతో ఇంతో పరిచయం ఉన్న అందర్నీ కోరుతోంది. నిన్నటికి నిన్న పాకిస్తాన్ .. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని వేడుకుంది. భారత్ సైనిక చర్యలకు సిద్ధమయిందని ఆపాలని కోరింది. తాము ఉగ్రవాదానికి మద్దతుగా లేమని పహల్గాం దాడి విషయంలో విచారణకు పూర్తిగా సహకరిస్తామని అంటోంది. అంతర్జాతీయ విచారణకు సిద్ధిని చెబుతోంది.
రష్యా కూడా పాకిస్తాన్ కోసం భారత్ తో దౌత్యం జరుపుతోంది. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధానికి ఫోన్ చేశారు. సైనిక చర్య విషయంలో సంయమనం పాటించాలని కోరారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అందులో సందేహం లేదని .. ఆ విషయంలో పూర్తి సపోర్టుగా ఉంటామన్నారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కూడా .. భారత్ ఆవేదనను అర్థం చేసుకుంటామని కానీ సైనికచర్య పరిష్కారం కాదని అంటున్నారు.
ఉగ్రవాద శిబిరాలపై పాకిస్తాన్ స్వయంగా దాడులు చేసి వారిని హతమారిస్తే తప్ప భారత్ సైనిక చర్యలు తీసుకోకుండా ఆగే అవకాశాలు లేవు. ఉగ్రవాదులకు ప్రోత్సాహం ఇక పాకిస్తాన్ వైపు నుంచి ఉండదని నమ్మితే తప్ప.. పీవోకేలో టెర్రర్ క్యాంపులపై దాడులు చేయకుండా ఆపరు. భారత్ అంతర్జాతీయంగా వచ్చే ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ మాత్రం..కాళ్ల బేరానికి రావాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాల కాళ్లూ పట్టుకుంటోంది.