ఆసియా కప్లో పాకిస్తాన్ పరువు పోగొట్టుకోవడం అనేది నిరంతర ప్రక్రియగా సాగుతోంది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ ముఖం కూడా చూసేది లేదని హోటల్ రూం నుంచి మ్యాచ్ ఆడేందుకు రాని పాకిస్తాన్ కాసేపటికి పరుగులు పెట్టుకుంటూ వచ్చింది.
ఆండిపైక్రాఫ్ట్ను టోర్నీ నుంచే తీసేయాలని పీసీబీ డిమాండ్ చేసింది. కానీ ఐసీసీ చాన్సే లేదని తేల్చింది. కనీసం తాము ఆడే మ్యాచ్ల నుంచి అయినా తప్పించాలని కోరింది. అది కూడా సాధ్యం కాదని ఐసీసీ చెప్పింది. దాంతో పరువు ఎలా కాపాడుకోవాలో పీసీబీకి అర్థం కాలేదు. ఓ వైపు మ్యాచ్ కు వెళ్లకపోతే.. వందల కోట్ల రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది. దీంతో మధ్యేమార్గంగా రిఫరితో క్షమాపణ చెప్పించాలని కోరింది. పాపం ఏడుస్తున్నారని మ్యాచ్ రిఫరీ.. చెప్పి చెప్పనట్లుగా క్షమాపణలు చెప్పేందుకు అంగీకరించారు.
దాంతో టీం మ్యాచ్ కు వచ్చింది. ఆట ప్రారంభమయింది. ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ లో పాకిస్తాన్ పరువు పోగొట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. షేక్ హ్యాండ్ వివాదాన్ని పెద్దది చేసుకుని.. సరెండర్ కావడం అనేది తమకు తెలిసిన విద్య అని మరోసారి నిరూపించుకుని నవ్వుల పాలయింది.