పాక్ దొంగబుద్ది మరోసారి బయటపెట్టుకుంది. కాల్పులను విరమించాలని అభ్యర్ధించిన పాక్.. సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడింది. సీజ్ ఫైర్ ప్రకటించిన మూడు గంటల్లోనే సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. జమ్మూ – కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాక్ వరుసగా కాల్పులు జరిపి వక్రబుద్ధిని బయటపెట్టుకుంది.
మరోసారి సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు చేపట్టింది.సరిహద్దు నగరాలపై వరుసగా డ్రోన్ దాడులు చేపట్టింది. శ్రీనగర్ లో డ్రోన్ దాడులను భారత ఆర్మీ తిప్పికొట్టింది.అలాగే , కాల్పులను తిప్పికొట్టాలని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు ఆదేశాలు అందాయి. పాక్ కాల్పుల విరమణకు తూట్లు పొడవడంతో జమ్మూ కాశ్మీర్ – పంజాబ్ రాష్ట్రాలలోని సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ ప్రకటించారు అధికారులు. ప్రజలు ఎవరూ ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని ఆదేశించారు.
పరిస్థితులు చేజారిపోతాయని అంచనా వేసిన పాక్.. కాల్పుల విరమణను పాటించాలని భారత్ ను కోరింది. పాకిస్తాన్ డీజీఎంఓ శనివారం మధ్యాహ్నం 15:35 గంటలకు భారత డీజీఎంఓకు ఫోన్ చేసి,చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని అభ్యర్థించడంతో భారత్ కూడా అంగీకరించింది.
ఇరు దేశాల మధ్య చర్చలు జరిపి..శాంతియుత వాతావరణం నెలకునేలా చర్యలు చేపట్టాలని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ కూడా చేశారు. చొరవ ఎవరూ చూపించినా.. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. అంతలోనే పాక్ తన దొంగబుద్దిని ప్రదర్శిస్తూ..కాల్పులకు తెగబడింది. దీంతో ఈసారి భారత్ పాక్ కు చుక్కలు చూపించనుంది.