2019 ఓటర్ల లిస్ట్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు..!

పంచాయతీ ఎన్నికలు ఆపేందుకు చేసిన చిట్ట చివరి ప్రయత్నమూ ఫెయిలయింది. 2021 ఓటర్ల జాబితాను పంచాయతీరాజ్ శాఖ ప్రచురించకపోవడంతో 2019 ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికల కమిషన్.,. పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తోంది. అయితే ఇలా చేయడం వల్ల మూడున్నర లక్షల మంది యువ ఓటర్లు ఓటింగ్‌కు దూరమవుతారని.. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని.. తక్షణం ఎన్నికలు నిలిపివేసి.. 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకటి దూళిపాళ్ల అఖిల అనే యువతి దాఖలు చేయగా..మరొకటి ఓ న్యాయవాది దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు… ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెబుతూ పిటిషన్లను కొట్టి వేసింది.

2019 ఎన్నికల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో తనకు ఓటు వేసే అవకాశం లేకుండా పోయిందని ధూళిపాళ్ల అఖిల వాదించారు. అయితే.. ఆమె అసలు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఈ విషయాన్ని ఎస్‌ఈసీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌ను కొట్టి వేసే అవకాశం ఉందని ముందుగానే గుర్తించడంతో మరో లాయర్‌తోనూ అలాంటిపిటిషనే వేయించారు అధికార పార్టీ నేతలు. రెండింటిపైన విచారణ జరిపిన హైకోర్టు.. చివరికి జోక్యం చేసుకోలేమని తేల్చేసింది.

ఈ పిటిషన్‌పై విచారణలో 2019 ఓటర్ల జాబితాను ఉపయోగించడానికి కారణలేమిటో ఎస్‌ఈసీ ప్రత్యేక అఫిడవిట్ ద్వారా హైకోర్టుకు సమర్పిస్తుందని.. హైకోర్టుకు హామీ ఇచ్చినా గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజాశంకర్‌లు ఓటర్ల జాబితాను ప్రచురించలేదని కోర్టు దృష్టికి బలంగా తీసుకెళ్లి వారు చేసిన తప్పును చట్ట ప్రకారం… కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా తేలుస్తారని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఎస్‌ఈసీ అంత కఠినంగా వ్యవహరించలేదు. దీంతో ఆ అధికారులు ఇద్దరూ ఓటర్ల జాబితా విషయంలో కోర్టు ధిక్కరణ చర్యలకు గురి కాకుండా ఈ పిటిషన్ విషయంలో బయటపడ్డారని న్యాయవాద వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ బీజేపీకి దారి చూపిన రఘురామకృష్ణరాజు !

వైసీపీ సర్కార్‌పై ఎలా పోరాడాలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ బీజేపీ నేతలకు దారి చూపారు. ఆ దారిలో సోము వీర్రాజు అండ్ బృందం విమర్శలు ప్రారంభించారు. వైఎస్ జగన్‌కు డబుల్,...
video

బంగార్రాజు నుంచి బ్యూటీఫుల్ మెలోడీ

https://www.youtube.com/watch?v=d9eINA5rgzI సంక్రాంతి బరికి సిద్దమౌతున్న మరో సినిమా నాగార్జున 'బంగార్రాజు'. సోగ్గాడే చిన్ని నాయనాకు ఫ్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య కూడా ప్రధాన పాత్ర పోహిస్తున్నాడు. ఇప్పటికే చైతు పై విడుదల...

వేరే మహిళలకు లేనివి నాకేమైనా ఉన్నాయా ? : పాయల్

ఓ ఫోటో షూట్ విషయంలో తనను ట్రోలింగ్ చేస్తున్న వారికి హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కడిగిపడేసింది. వేరే మహిళలకు లేనివి తనకు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించింది. ఎందుకంటే ఇటీవల పాయల్ రాజ్‌పుత్...

“బియ్యం”పై ఇరుక్కుపోయిన టీఆర్ఎస్ ! వాట్ నెక్ట్స్ ?

వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ చాలా రాజకీయం చేస్తోంది. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. కేంద్రం కొనబోమని ఎప్పుడూ చెప్పలేదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కానీ ఎంత కొంటామో చెప్పాలంటూ...

HOT NEWS

[X] Close
[X] Close