మున్సిపల్ పోరు మినీ అసెంబ్లీ వారే..!

మార్చి పధ్నాలుగో తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలన్నీ గెలుపు తమదంటే తమదని ప్రకటించుకున్నాయి. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. ఎవరి అనుకూల మీడియాలో వారికి అందలం దక్కింది.కానీ అసలు మ్యాటర్ ఏంటో మాత్రం ప్రజలకు అర్థం కాలేదు. ఎవరికి ఎక్కువ స్థానాలు వచ్చాయోప్రజలు అంచనా వేయలేకపోయారు. దీనికి కారణం పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరగడమే. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు మాత్రం పార్టీల ప్రకారమే జరుగుతాయి. పార్టీల గుర్తుల ప్రకారమే జరుగుతాయి. పార్టీల అభ్యర్థులు ఉంటారు.

ఫలితాలను కూడా పార్టీ పరంగానే ధృవీకరిస్తారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను మ్యానిప్యూలేట్ చేయడానికి అవకాశం ఉండదు. ఉంటే గింటే ఫలితాలనే మ్యానిప్యూలేట్ చేయాలి. మొత్తంగా 75 మున్సిపాలిటీలు..నగర పంచాయతీలు.. అలాగే పన్నెండు కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఓ రకంగా ఇది మినీ అసెంబ్లీ ఫైట్ అనుకోవడమే. ప్రతి కీలక నియోజకవర్గంలోనూ మున్సిపాలిటీ ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కార్పొరేషన్ ఉంది. ఈ కారణంగా మున్సిపల్ ఎన్నికలను ప్రజాభిప్రాయంగా పరిగణించవచ్చు. పైగా… గ్రామాలతో పోలిస్తే.. ఇక్కడ లోకలైజేషన్ మరీ అంత తీవ్రంగా ఉండదు. ప్రజల ఓట్ల ప్రయారిటీకి స్థానిక సమస్యలతో పాటు ప్రభుత్వ విధానాలు కూడా.. కారణంగా మారే అవకాశం ఉంది.

అందుకే… ప్రజల తీర్పుపై ఆసక్తి ఏర్పడింది. మొత్తం మున్సిపాల్టీలు కార్పొరేషన్లు కైవసం చేసుకుంటామని అధికార పార్టీ ధీమాగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన విజయంతో పోలిస్తే.. కైవసం చేసుకోవాలి కూడా. అలా కాకుండా కొన్ని సీట్లు కోల్పోయినా ప్రతిపక్షం పుంజుకుందనే భావన ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఈ ఎన్నికలు పెను సవాల్. తాము బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పార్టీలు.. ఆ బలానికి సర్టిఫికెట్లుగా ఓట్లను తెచ్చుకోవాల్సిన ఉంటుంది. లేకపోతే..గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులకు కారణమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close