దళిత నేతలతోనే న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు..! వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

వైసీపీ రాజకీయ వ్యూహం.. న్యాయవ్యవస్థపై సామాజిక పద్దతుల్లో అమలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని… దళితుల్ని అడ్డు పెట్టుకుని.. న్యాయవ్యవస్థపై విమర్శలు చేసి.. ఒత్తిడి పెంచే మార్గాలను అనుసరిస్తున్నారని అంటున్నారు. గతంలో ఎంపీ నందిగం సురేష్ ఈ విషయంలో దూకుడుగా.. ఉండగా.. తాజాగా.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పండుల రవీంద్రబాబును రంగంలోకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. పండుల రవీంద్రబాబు.. జడ్జిలు.. కోర్టులు… జగన్ వెంట్రుకను కూడా పీకలేవంటూ… చాలా దారుణమైన భాషతో తాజాగా.. విమర్శలు చేశారు.

గతంలో వైసీపీ ఎంపీ నందిగం సురేష్.. హైకోర్టు న్యాయమూర్తులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి. మొదట ఇంగ్లిష్ మీడియం వివాదంపై.. న్యాయమూర్తుల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత కాల్ లిస్ట్ బయటపెట్టాలంటూ… ఆరోపణలు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం కూడా అవే వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు సీరియస్ అయిన తర్వాత… న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలను కంట్రోల్ చేశారు. కానీ.. ఇప్పుడు… పండుల రవీంద్రబాబు మళ్లీ విమర్శలు చేయడంతో.. వైసీపీ.. దళిత నేతలను ముందు పెట్టి.. న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచాలనుకునే వ్యూహాన్ని అమలు చేస్తోందని భావిస్తున్నారు.

సాధారణంగా వైసీపీ నేతలు… పార్టీ కార్యాలయం నుంచి వచ్చే సందేశాలకు అనుగుణంగానే మాట్లాడతారు. లేకపోతే.. మాట్లాడరు. ఆ పార్టీలో అలాంటి కట్టుబాటు ఉంది. ఎంతటి సీనియర్ నేత అయినా… అది తప్పదు. నందిగం సురేష్, పండుల రవీంద్రబాబు వంటి వారు దానికి మినహాయింపు కాదు. హైకమాండ్ పర్మిషన్ లేకపోతే. ప్రెస్ మీట్ కూడా పెట్టరు. అందుకే… వైసీపీ తీరుపై అనేక సందేహాలు వస్తున్నాయి. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. దళితులే బలవుతారని.. దాన్ని రాజకీయం చేసుకోవచ్చన్నట్లుగా వైసీపీ వ్యూహం ఉందనే.. అభిప్రాయాలు.. ఇతర పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా...

అక్టోబ‌ర్ 2: డ‌బుల్ బొనాంజా

ఒకేరోజు రెండు సినిమాలు వ‌స్తే ఆ సంద‌డే వేరుగా ఉంటుంది. థియేట‌ర్లు మూత‌బ‌డిన వేళ‌.. ఒక సినిమా విడుద‌ల కావ‌డ‌మే అద్భుతం అన్న‌ట్టు త‌యారైంది. అయితే ఈసారి ఓకేరోజు రెండు సినిమాలు ఓటీటీ...

ఈపీఎస్, ఓపీఎస్ మధ్యలో శశికళ..!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయం జోరందుకుంటోంది. ముఖ్యంగా నాయకత్వ సమస్యతో ఉన్న అధికార పార్టీ అన్నాడీఎంకే ఇది మరీ ఎక్కువగాఉంది. ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి.. ఉపముఖ్యమంమత్రి ఈ.పన్నీర్ సెల్వం మధ్య...

అమరావతికి ముంపు లేదని మరోసారి సర్టిఫికెట్ వచ్చేసిందా..!?

రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని గతంలో హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. దీంతో ముంపు నివారించే పధకం రూపొందించాకే రాజధాని నిర్మాణం పై ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది....

HOT NEWS

[X] Close
[X] Close