మోడీ పిలుపునిచ్చాక అమిత్ షా ఆగుతారా..!?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. స్వదేశీ మంత్రం పఠించారు. అందరూ.. స్థానిక ఉత్పత్తులనే వినియోగించాలని మంగళవారం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తూ.. దేశ ఆర్థిక స్వావలబన సాధించే ప్రణాళికలను వివరించారు. స్థానిక ఉత్పత్తులను వాడటం ద్వారా.. దేశం తయారీ రంగంలో ముందుకెళ్తుందన్నారు. ప్రధాని అలా పిలుపునిచ్చారో లేదో.. ఇలా అమిత్ షా… తన పరిధిలోని హోంమంత్రిత్వ శాఖలోని క్యాంటీన్లలో కేవలం స్వదేశీ తయారీ వస్తువులు మాత్రమే అమ్మాలని నిబంధనల తీసుకొచ్చారు. దీన్ని జూన్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తారు. హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకి పారాలమిటరీ క్యాంటీన్లు అన్నీ వస్తాయి. వీటిలో నిత్యావసర సరుకులు అన్నీ అమ్ముతూ ఉంటారు.

అలాగే.. ఉద్యోగుల కుటుంబాలకు కావాల్సిన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా.. అమ్ముతూంటారు. వీటన్నంటిలోనూ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి స్థానికంగా తయారైన వస్తువులను మాత్రమే అమ్ముతారు. అమిత్ షా నిర్ణయం వల్ల పది లక్షల మంది పారా మిలటరీ సిబ్బందితో పాటు వారి కుటుంబంలోని యాభై లక్షల మంది స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించ‌నున్నారు’. వీటి విలువ.. ఏటా రూ .2,800 కోట్ల వరకూ ఉంటుంది. అమిత్ షా ప్రారంభించారు.. ఇక మిగతా శాఖలు మాత్రం ఊరుకుంటాయా..? ఆయా శాఖల మంత్రులందరూ… తమ తమ శాఖల్లో ఇత స్వదేశీ వస్తవులే ఉపయోగించాలని.. వరుసగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ ట్రెండ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వలకూ పాకనుంది. ఏంతైనా స్వదేశీ నినాదం సెంటిమెంట్ చాలా బలమైనది.. అంతే బలంగా.. బీజేపీ ప్రణాళిక ప్రకారం ప్రజల్లోకి తీసుకెళ్తుంది. సక్సెస్ అయితే.. భారత్‌లో విదేశీ వస్తువులకు గిరాకి తగ్గినట్లే అనుకోవాలి. కానీ.. ఎంత మేర.. భారతీయుల అవసరాల మేరకు ఇక్కడ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయన్నదే చాలా మందికి డౌట్..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పార్టీ వేరు.. ప్రభుత్వం వేరంటున్న ఆర్ఆర్ఆర్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో విందు భేటీ నిర్వహించారు. ఆయన రాజకీయం కొద్ది రోజులుగా బీజేపీ చుట్టూనే తిరుగుతోంది. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా.. పొగుడుతూ...

“ఉస్మానియా” పాపం ప్రతిపక్షాలదేనా..?

ఉస్మానియా ఆస్పత్రి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారింది. బుధవారం పడిన వర్షానికి ఉస్మానియా మొత్తం నీళ్లు నిండిపోవడం.. చికిత్స గదుల్లో కూడా నీరు చేరడంతో.. విపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఐదేళ్ల...

సంతోష్ కుమార్ చాలెంజ్ అంటే స్వీకరించాల్సిందే..!

కొద్ది రోజులుగా మీడియాలో.. సోషల్ మీడియాలో ఓ వార్త రెగ్యులర్‌గా కనిపిస్తోంది. అదే.. ప్రభాస్.. బ్రహ్మానందం.. సమంత లాంటి స్టార్లు.. మొక్కలు నాటుతూ.. చాలెంజ్‌ను కంప్లీట్ చేయడం.. ఆ చాలెంజ్‌ను మరికొంత...

కరోనా రాని వాళ్లెవరూ ఉండరు : జగన్

భవిష్యత్‌లో కరోనా వైరస్ సోకని వాళ్లు ఎవరూ ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని.. ఎవరూ వాటిని ఆపలేరని వ్యాఖ్యానించారు. కరోనా ఆపడానికి...

HOT NEWS

[X] Close
[X] Close