‘గీత గోవిందం’తో వంద కోట్ల సినిమా అందించాడు దర్శకుడు పరశురామ్. ‘సర్కారు వారి పాట’ కూడా ఫర్వాలేదనిపించింది. ‘ఫ్యామిలీ స్టార్’ మాత్రం బాగా నిరుత్సాహ పరిచింది. ఆ దెబ్బకు ఇప్పటి వరకూ పరశురామ్ సినిమా సెట్ కాలేకపోయింది. చాలా కాలంగా ఓ కథ పట్టుకొని హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ఏదీ వర్కవుట్ కావడం లేదు. చివరికి తమిళ హీరో సూర్య తో ప్రాజెక్ట్ సెట్ అయ్యిందని ఇన్ సైడ్ వర్గాల టాక్.
హీరో సూర్య ఈమధ్య తెలుగు దర్శకులవైపు చూస్తున్నారు. ఇప్పటికే వెంకీ అట్లూరితో ఓ సినిమా పట్టాలెక్కించారు. ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇప్పుడు పరశురామ్ కథ కూడా ఓకే చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తారు. వారం పది రోజుల్లో ఈ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ వస్తుంది. ఇది వరకు పరశురామ్ కార్తికి కూడా ఓ కథ వినిపించారు. కార్తికి ఆ కథ నచ్చినా, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. తమ్ముడితో కుదరకపోయినా.. అన్న సూర్యతో మాత్రం పరశురామ్ సాధించుకొన్నట్టే కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలో ఉందని, అన్నీ కుదిరితే ఉగాదికి ఓ ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.
