‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ డైలాగ్ ఎందుకంటే..?

స‌ర్కారు వారి పాట‌లో… డైలాగుల్ని కుమ్మ‌రించేశాడు ప‌ర‌శురామ్‌. స్వ‌త‌హాగా ర‌చ‌యిత కాబ‌ట్టి… త‌న పంచ్ ప‌వ‌ర్‌, పెన్ ప‌వ‌ర్ చూపించేశాడు. ఎక్కువ డైలాగులు మాసీగానే ఉన్నాయి. అయితే.. అందులో `నేను ఉన్నాను.. నేను విన్నాను` డైలాగ్ మాత్రం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. ఈ డైలాగ్ ఎందుకు రాయాల్సివ‌చ్చిందో.. కార‌ణం ఇప్పుడు చెప్పుకొచ్చాడు ప‌ర‌శురామ్‌.

“నాకు రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంటే చాలా ఇష్టం. ఆయ‌న‌కు హీరో వర్షిప్ ఉండేది. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన `నేను ఉన్నాను.. నేను విన్నాను` అనే పొలిటిక‌ల్ డైలాగ్ నాకు చాలా ఇష్టం. చాలా అర్థం ఉంది అందులో. ఎంత పెద్ద భావాన్ని.. ఇంత చిన్న ముక్క‌లో భ‌లే చెప్పారు అనిపించింది. అలాంటి సంద‌ర్భం `స‌ర్కారు వారి పాట‌`లో ఒక‌టి వ‌చ్చింది. క‌థానాయిక కీర్తి సురేష్‌కి అలాంటి భ‌రోసానే హీరో ఇవ్వాల్సివ‌చ్చిన‌ప్పుడు ఈ డైలాగ్ ప‌ర్‌ఫెక్ట్ గా స‌రిపోతుంద‌నిపించింది. స్క్రిప్టు రాస్తున్న‌ప్పుడే ఈ డైలాగ్ ఉంది. మ‌హేష్ కూడా ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేదు. ఎలాంటి డిస్క‌ర్ష‌న్ లేకుండా.. సెట్లో ఈ డైలాగ్ ఓకే అయిపోయింది“ అని చెప్పుకొచ్చారు ప‌ర‌శురామ్‌. ఈనెల 12న స‌ర్కారు వారి పాట విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌వాత‌.. నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా చేయ‌బోతున్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ అంచనాల్ని అందుకోలేకపోయిన ప్రశాంత్ కిషోర్ !

ఐ ప్యాక్ అంటే తిరుగులేని పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ. దేశంలో ఉన్న ప్రతీ పార్టీ సేవలు అందుకోవాలని అనుకుంటుంది. ఐ ప్యాక్ కన్నా పీకే పైనే అందరికీ గురి. బెంగాల్ తర్వాత తాను...

సోషల్ మీడియాలోనూ దారి తప్పిన ఏపీ రాజకీయాలు !

తమలపాకుతో నువ్వకొటి అంటే.. తలుపు చెక్కతో నేను రెండు అంటా అన్నట్లుగా ఏపీలో రెండు పార్టీల నేతలూ.. సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రెండు పార్టీలకు...

మిడిల్ డ్రాప్ … దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ లేనట్లే !

ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ నతలు వస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని పొగుడుతున్నారు. వెళ్తున్నారు. ఇక టీఆర్ఎస్ నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు...

ఏపీలో పోటాపోటీ పోస్టర్లు .. భారతీ పే !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గోడలకెక్కుతున్నాయి. గతంలో చంద్రబాబు వియ్ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని అన్నారంటూ... ఓ ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన వార్తను పెద్ద పెద్ద పోస్టర్లు చేసి వైసీపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close