‘శ్రీ‌కారం’లో మ‌రో ద‌ర్శ‌కుడి హ్యాండ్

ఈవారం విడుద‌లైన చిత్రాల‌లో శ్రీ‌కారం మంచి టాకే సంపాదించుకుంది. చ‌క్క‌టి సందేశంతో – సాగిన సినిమా అని ప్రేక్ష‌కులు, సినీ విశ్లేష‌కులు కితాబు ఇస్తున్నారు. కిషోర్ ఈ సినిమాతోనే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. అయితే ఈ సినిమాలో మ‌రో ద‌ర్శ‌కుడి హ్యాండ్ కూడా ఉంద‌ట‌. ఆ ద‌ర్శ‌కుడెవ‌రో కాదు…. ప‌ర‌శురామ్‌,

14 రీల్స్ సంస్థ నిర్మించిన చిత్ర‌మిది. ఇదే సంస్థ‌లో ప‌ర‌శురామ్ `స‌ర్కారు వారి పాట‌` చేస్తున్నాడు. శ్రీ‌కారం క‌థ విష‌యంలోనూ ప‌ర‌శురామ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంద‌ట‌. క‌రోనా త‌ర‌వాత‌.. స్క్రిప్టులో కొన్ని మార్పులు జ‌రిగాయి. ఆ స‌మ‌యంలో.. ప‌ర‌శురామ్ కొన్ని కీల‌క‌మైన స‌ల‌హాలు అందించాడ‌ట‌. క‌రోనా వ‌ల్ల వ్య‌వ‌సాయం రంగంలో వ‌చ్చిన మార్పులకు సంబంధించిన స‌న్నివేశాల‌న్నీ.. ప‌ర‌శురామ్ స‌ల‌హాతో రాసుకున్న‌వేన‌ట‌. అంతేకాదు.. క్లైమాక్స్‌లో రావు ర‌మేష్‌చెప్పిన డైలాగుల్లో కొన్ని.. డ‌బ్బింగ్ స‌మ‌యంలో ప‌ర‌శురామే.. చిన్న చిన్న మార్పులు చేసి రాసిచ్చాడ‌ని తెలుస్తోంది. అలా.. ఓ వైపు స‌ర్కారు వారి పాట ప‌నులు చూసుకుంటూనే త‌న నిర్మాత‌ల కోసం `శ్రీ‌కారం`కి చేదోడు వాదోడుగా నిలిచాడ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బోల్డ్ గా భయపెట్టిన లైగర్

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజగా లైగర్ నుండి ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ...

ఎన్టీఆర్ కథ గోపిచంద్ కు

దర్శకుడు హరి మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. 'సింగం' ఆయన సక్సెస్ఫుల్ సిరిస్. ఈ సిరిస్ కి తెలుగులో కూడా ఆకట్టుకుంది. హరికి ఎప్పటి నుండో నేరుగా ఒక తెలుగు...

సీఎం జగన్ పేరుతో సైబర్ నేరాలు !

అప్పుడెప్పుడో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. కోట్లు కొట్టేయడానికి దర్జాగా కోల్‌కతా సూట్ కేస్ కంపెనీల పేరుతో చెక్‌లు జమ చేశారు. ఆ కేసు ఇంత వరకూ తేలలేదు. కానీ ఇప్పుడు...

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ – పబ్లిసిటీ బడ్జెట్ కోట్లకు కోట్లే !

సోషల్ మీడియా సంస్థలకు.. మీడియా సంస్థలకు పండగ లాంటి సమయం ఇది. వద్దంటే రాజకీయ పార్టీలు కుప్పలు కుప్పలుగా ప్రకటనలు ఇస్తున్నాయి. రూ. కోట్లకు కోట్లు ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close