సెట్లో అన్య‌మ‌న‌స్కంగా ప‌వ‌న్‌?

ప‌వ‌న్ క‌ల్యాణ్ రీ ఎంట్రీ చూడాల‌న్న అభిమానుల క‌ల నెర‌వేరింది. `పింక్` షూటింగ్ మొద‌లైంది. ప‌వ‌న్ పై కొన్ని స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు కూడా. అయితే ప‌వ‌న్ మూడ్ పూర్తిగా సినిమాల‌వైపు రాలేదేమో అనిపిస్తోంది. సెట్లో ప‌వ‌న్ అన్య‌మ‌న‌స్కంగా ఉంటున్న‌ట్టు, ఇది వ‌ర‌క‌టి వేడి, వాడి, హుషారు క‌నిపించ‌డం లేద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. నిజానికి ప‌వ‌న్ సెట్లో క‌లివిడిగా ఉండ‌లేడు. ఇంత గ్యాప్ త‌ర‌వాత‌, పైగా స‌వాల‌క్ష రాజ‌కీయ స‌మ‌స్య‌ల మ‌ధ్య ప‌వ‌న్ సినిమాపై, న‌ట‌న‌పై దృష్టి పెట్ట‌లేక‌పోతున్న‌ట్టు టాక్‌.

దానికితోడు ప‌వ‌న్ గంట‌ల కొద్దీ కేర్ వాన్‌లోనే ఉండిపోతున్నాడ‌ట‌. ‘సార్‌.. షాట్ రెడీ’ అని పిల‌వ‌డానికి స‌హాయ ద‌ర్శ‌కులు సైతం ధైర్యం చేయ‌డం లేద‌ని తెలుస్తోంది. ఆయ‌న కార్ వాన్‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడే షాట్ పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి. ఇలాగైతే షూటింగ్ ఎప్పుడు పూర్త‌వుతుందో అని దిల్‌రాజు కాస్త భ‌య‌ప‌డుతున్న‌ట్టు టాక్‌. `పింక్‌` రీమేక్ కాబ‌ట్టి ఫ‌ర్వాలేదు. ప‌వ‌న్ స్క్రీన్ టైమ్ చాలా త‌క్కువ‌. కానీ క్రిష్ సినిమా అలా కాదు. సినిమా మొత్తాన్ని ప‌వ‌న్ న‌డిపించాలి. అక్క‌డ కూడా ఇలానే గంట‌ల కొద్దీ కార్ వ్యాన్ లో కూర్చుంటే నిర్మాత‌ల ప‌రిస్థితేమిటో? పైగా వంద కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతున్న సినిమా అది. క్రిష్ సినిమా మొద‌ల‌య్యే స‌రికి ప‌వ‌న్ మూడ్ సినిమాల‌వైపు కు మారాల‌ని ఆశించ‌డం మిన‌హా చేసేదేం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com