ప‌వ‌న్ ప‌క్క‌న పూజా హెగ్డే.. హ‌రీష్ చెప్పేశాడు

గ‌బ్బ‌ర్ సింగ్ కాంబినేష‌న్ మ‌రోసారి సెట్ అయ్యింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో హ‌రీష్ శంక‌ర్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి `భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్` అనే పేరు ఖ‌రారు చేశారు. అయితే క‌థానాయిక ఎవ‌రో ఇంత వ‌ర‌కూ తెలీలేదు. ఆ ఛాన్స్ పూజా హెగ్డేకి దక్క‌డం దాదాపుగా ఖాయ‌మైపోయింది.

హ‌రీష్ కి పూజ హెగ్డే సెంటిమెంట్ గా మారిపోయింది. డీజే, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రాల్లో త‌నే క‌థానాయిక. ఇప్పుడు ప‌వ‌న్ సినిమాకీ త‌ననే తీసుకోవాల‌ని గ‌ట్టిగా ఫిక్స‌య్యాడు. దాదాపు త‌నే ఖాయం కూడా. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` ప్రీ రీలీజ్ ఫంక్ష‌న్ లో పూజా ని ఎంచుకున్న విష‌యంలో నోరు జారేశాడు హ‌రీష్‌. `పూజా బాగా బిజీ అయిపోయింది. పెద్ద హీరోలంద‌రితోనూ సినిమాలు చేస్తోంది. మ‌హేష్ బాబు, ప్ర‌భాస్‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌..“ అంటూ ప‌వ‌న్‌ని తీసుకొచ్చేశాడు. అంటే.. భ‌వ‌దీయుడులో ప‌వ‌న్‌కి జోడీ దొరికేసింద‌ని చెప్పేయ‌డ‌మే. కాక‌పోతే…ఈ కాంబోకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సివుందంతే. త్వ‌ర‌లోనే `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఆ త‌ర‌వాత‌… హ‌రీష్ సినిమానే ప‌ట్టాలెక్కిస్తాడు ప‌వ‌న్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘వాంటెడ్ పండుగాడ్‌’

Wanted PanduGod movie review telugu తెలుగు360 రేటింగ్ :1/5 చ‌దువుకోక ముందు కాక‌ర‌కాయ్ అన్న‌వాడే.. చ‌దువొచ్చాక‌.. కీక‌ర‌కాయ్ - అన్నాడ‌ట‌. పాత సామెతే. కానీ.. ఇప్పుడు కొత్త‌గా చెప్పుకోవాల్సివ‌స్తోంది.. వాంటెడ్ - పండుగాడ్ అనే...

తెలంగాణకు వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కాం !

ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణలోనూ కలకలం రేపే అవకాశఆలు కనిపిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీశ్ సిసోడియాతో పాటు 15 మందిని ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా...

మ‌ణిర‌త్నం సినిమాలో చిరంజీవి?

మ‌ణిర‌త్నం ఓ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు. హిట్లు, ఫ్లాపులు ఎన్న‌యినా రానివ్వండి.. ఆయ‌న మార్క్ ఆయ‌న‌దే. ఎంత ఫ్లాప్ సినిమా అయినా... 'మ‌ణి ఈ సీన్ భ‌లే తీశాడ్రా..' అనో 'మ‌ణి ఈ షాట్...

రోడ్లు, డాక్టర్లు .. డెడ్ లైన్లు – ప్రకటనలే పాలన !

ఏపీ సీఎం జగన్ అధికారులతో చేసే సమీక్షల్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ.. ఎడిటింగ్ చేసిన వీడియోలు విడుదల చేస్తారు. ఓ ప్రెస్ నోట్ మాత్రం వస్తుంది. అ ప్రెస్‌నోట్‌లో ఏ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close