సేనానికి..సేన సేవలను పక్కాగా ప్రజలకు అందించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఓ కొత్త కాన్సెప్ట్‌ను ప్రకటించారు. రాజకీయ వ్యవస్థలో సేనను భాగస్వామ్యం చేసేందుకు “సేనతో సేనాని – మన నేల కోసం కలిసి నడుద్దాం” అంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రకటించారు. మార్పు కోరుకుంటే రాదు – మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుందని పవన్ కల్యాణ్ పాలసీ. ఈ ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
సమాజంలో మార్పు కాంక్షించే ప్రతీ ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేందుకు ఈ కార్యక్రమం ద్వారా అవకాశం కల్పించనున్నారు. యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు రిజిస్టర్ చేసుకునే అవకాశాల్ని కల్పించారు. పాల్గొనాలనుకునే యువత QR కోడ్ స్కాన్ చేసి లేదా లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. పార్టీ అధికారిక సోషల్ మీడియా పోస్ట్‌లలో QR కోడ్ అందుబాటులో ఉంది.
ఇది రాజకీయాలకు అతీతమైన వేదిక. అయితే ఇందులో నాయకత్వ ప్రతిభ చూపించే వారికి రాజకీయ భవిష్యత్ కల్పించే విషయాలను ఆలోచించే అవకాశం ఉంది. సేనానితో కలిసి నడవడానికి లక్షల మంది సైన్యం ఉన్నారు. వారందర్నీ పక్కాగా ప్రజా సేవకు వినియోగించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.