హరిహర వీరమల్లు టీం మళ్లీ డీలా పడింది. జూన్ 12న రావాల్సిన సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడింది. నిజానికి ఎప్పుడో రావాల్సిన సినిమా ఇది. ఏవో కారణాలతో అనుకున్న సమయంలో పనులు జరగలేదు. ఒక దశలో సినిమా ఇక షూటింగ్ పూర్తి చేసుకోవడమే కష్టం అనే అభిప్రాయాలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ సపోర్ట్, నిర్మాత ఏ.ఎం. రత్నం ఓపికతో సినిమాను పూర్తి చేయగలిగారు. ఇప్పుడు నిర్మాతకు మరింత ఉపశమనం కల్పిస్తూ పవన్ కళ్యాణ్ నుంచి ఓ భరోసా లభించింది.
వీరమల్లు ప్రమోషన్స్‌లో పాల్గొంటానని నిర్మాత రత్నంకు మాటిచ్చారు పవన్ కళ్యాణ్. ఇది నిజంగా బిగ్ రిలీఫ్. పవన్ సహజంగా ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటారు. ఆయన ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ చేసే సినిమాకైనా సరే, ఒక్క ప్రీరిలీజ్ ఈవెంట్‌కి తప్ప మరో ఈవెంట్లో కనిపించరు. మీడియాకి ఆయన సినిమా ఇంటర్వ్యూ ఇవ్వడం గగనం. కానీ ఇప్పుడు వీరమల్లుకు పవన్ అవసరం ఉంది. అందుకే నిర్మాతకు అండగా నిలిచి భరోసా ఇవ్వడానికి ఆయన ప్రమోషన్స్‌కి సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్‌లో కనిపిస్తే బజ్ రెట్టింపవ్వడం పెద్ద విషయం కాదు.