ఆర్టీసీ డ్రైవర్ ఆత్మబలిదానం కలచివేసింది : పవన్ కళ్యాణ్

తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె రాను రాను తీవ్రం కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం తలచుకుంటే పరిష్కరించగలిగిన సమస్య అయినప్పటికీ, టిఆర్ఎస్ ప్రభుత్వం మొండి వైఖరితో వెళుతోంది అంటూ విపక్షాలు, ఆర్టీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రజలలో కూడా, ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిగా వెళుతోంది అన్న భావం ఏర్పడింది. మీడియాను మేనేజ్ చేస్తూ ప్రభుత్వం మీద వ్యతిరేక వార్తలు బయటకు రాకుండా, ఆర్టీసీ కార్మికులదే తప్పంతా అన్నట్లుగా కధనాలు రావడం కూడా ఆర్టీసీ కార్మికుల లోను ప్రజల లోను అసహనాన్ని కలిగిస్తుంది. ఆఖరికి ఒక ఆర్టీసీ డ్రైవర్ ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడితే, దానిని కూడా మీడియా వీలైనంతవరకు తక్కువగా చూపిస్తూ ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా కాపాడుతుంది అంటూ మీడియా మీద కూడా విమర్శలు వస్తున్నాయి.

ఇక అధికార పక్షం నేతలు మాత్రం, ఆర్టీసీ విలీనం తమ మేనిఫెస్టోలో లేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు కార్మికులని రెచ్చ గొడుతున్నాయని, తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలిచారు. ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి అని హితవు పలుకుతూనే, ఆర్టీసీ డ్రైవర్ ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే విషయాన్ని సూటిగా ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ,” ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస రెడ్డి ఆత్మ బలిశదానం తీవ్రంగా కలచి వేస్తోంది. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరం. ఖమ్మం బస్సు డిపో లో పని చేస్తున్న శ్రీనివాస్ శనివారం మధ్యాహ్నం ఒంటి పై కిరోసిన్ పోసుకుని ఆత్మ హత్య కు యత్నించగా తోటి కార్మికులు నిలవరించడంతో ఆయన ప్రాణాలు నిలబడ్డాయి. అప్పుడు ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుని శ్రీనివాస్ తో మాట్లాడి ఉంటే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆత్మహుతి అయ్యేవారు కాదు. భార్య పిల్లల ఎదుట ఆయన మంటల్లో దహించుకు పోవడం తలుచుకుంటేనే గుండెలు బరువెక్కుతున్నాయి. 80 శాతం కాలిన గాయాల తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ “ఆర్టీసీ కార్మికులు ఏడ మంచి గా ఉన్నారు” అని ప్రశ్నించడం చూస్తుంటే, శ్రీనివాస రెడ్డి ఎంతటి ఆవేదన తో ఉన్నారో అర్థమవుతుంది.

కోరుకున్న తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కూడా ఇటు వంటి బాధాకర సంఘటన చోటు చేసుకోవడం శోచనీయం. నష్ట పరిహారం ఇవ్వగలం కానీ శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ఆయనను మనం ఇవ్వగలమా? ఆయన లేని లోటు తీర్చ లేము. ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. వరంగల్ జిల్లా నర్సన్న పేట డిపో లో కూడా ఈ రోజు రవి అనే కార్మికుడు ఆత్మ హత్య కు ప్రయత్నించాడని వచ్చిన వార్త కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలి. ఆర్టీసీ కార్మికుల లో ధైర్యం నింపేలా చర్యలు తీసుకోవాలి. మరో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రజా ప్రతినిధుల మీద ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమింప చేయడానికి తక్షణం వారిని ప్రభుత్వం చర్చల కు పిలవాలి ఆత్మ బలి దానాలకు పాల్పడ వద్దని కార్మికులందరి కీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.”

ఇదిలా ఉంటే, ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి అంతిమ యాత్రకి కార్మికులు, వివిధ పార్టీల నేతలు భారీగా తరలి వచ్చారు. ఖమ్మం డిపో మీదుగా అంతిమ యాత్రకు పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పూర్తి పేరు వాడకపోతే జగన్ పార్టీకి చిక్కులే..!?

నర్సాపురం ఎంపీ తెచ్చిన పెట్టిన కష్టం.. వైసీపీని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆయనను టార్గెట్ చేసి.. రకరకాల కేసులు పెడుతూ.. చికాకు పెడుతున్నామని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారేమో కానీ.. ఆయన లేవనెత్తిన...

మీడియా వాచ్‌: ప్రముఖ కార్టూనిస్ట్‌‌కు క‌రోనా?

తెలుగులోనే అగ్ర‌గామి దిన ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్న ప్ర‌ముఖ కార్టూనిస్ట్‌‌ కు క‌రోనా సోకిన‌ట్టు స‌మాచారం. ద‌శాబ్దాలుగా అగ్ర‌గామిగా కొన‌సాగుతున్న ప‌త్రిక‌లో... ఈయ‌న కార్ట్యూన్ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంటుంది. తొలి పేజీలో.. త‌న గీతల‌తో...

కేసీఆర్ ఆరోగ్యంపై పిటిషన్.. హైకోర్టు ఆగ్రహం..!

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా కనిపించడం లేదని .. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియచేయాలంటూ... హైకోర్టులో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై...

ప్రసాదాలు, విగ్రహాలతో కేంద్రం నుంచి నిధులు రాలతాయా..!?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ...కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జీతాలు ఇవ్వడానికి ఎనిమిదో తేదీ వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంలో .. తక్షణం రాష్ట్రానికి...

HOT NEWS

[X] Close
[X] Close