[X] Close
[X] Close
ఇంత గందరగోళం అయితే ఎలా జనసేనాని..!?

అంబటి రాంబాబు, పవన్ కల్యాణ్.. ఇద్దరినీ పోలిస్తే.. అంబటి రాంబాబే కాస్త బెటరేమో..? .. ఇదీ ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి వ్యాఖ్య. ఏ ఉద్దేశంతో ఇలా అన్నారో కానీ.. రాజధాని గ్రామాల్లో ఆయన ప్రకటనలు చూసిన.. ఇతరులూ ఇలాగే అనుకుని ఉంటారు. మొదట రాజధాని గ్రామాల్లో పర్యటన ప్రారంభించినప్పుడు.. నేను రోడ్లమీదకొస్తే అమరావతిని ఇక్కడే ఉంచేస్తారా.. అని నిస్సహాయతను ప్రకటించి..చివరికి గ్రామానికి వెళ్లే సరికి. బీజేపీ నాకు హామీ ఇచ్చింది… అందుకే పొత్తు పెట్టుకున్నా.. అమరావతి కదలదు అని ప్రకటించేశారు. అసలు రైతులకు భరోసా ఇచ్చారో.. తానే జావగారిపోయారో.. ఎవరికీ అర్థం కాలేదు. సరే పవన్ కల్యాణ్‌ కదా… ఆయన మాటల్లో ది బెస్ట్ అనే డైలాగ్ తీసుకుని… అమరావతికి కట్టుబడి ఉన్నారని బీజేపీ హామీ ఇచ్చిందనే అనుకుందాం.. కానీ వెంటనే… అమిత్ షా చెప్పలేదు..మోడీ చెప్పలేదు.. కేంద్రానికి జగన్ చెప్పలేదు అని కొత్త రాగం అందుకున్నారు. కేంద్రానికి జగన్ చెప్పారో లేదో.. వాళ్లకే అంతర్గతంగా తెలుస్తుంది. పవన్ బీజేపీ కోసం ఎందుకంత… తాపత్రయ పడుతున్నారో.. ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

పవన్ కల్యాణ్ స్టైల్ అదే కాబట్టి.. అంతిమంగా.. రాజధాని రైతుల కోసం పోరాడతానని పవన్ కల్యణ్ చెప్పారని సరి పెట్టుకుందామనుకునేలోపు.. సందర్భం లేకపోయినా… వైసీపీ, బీజేపీ ప్రస్తావన తెచ్చారు. అసలు వెళ్లింది రాజధాని రైతులకు మద్దతివ్వడానికి. ఆ పనిలో .. మరో టాపిక్‌ను జత చేశారు. వైసీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయంటూ జరుగుతున్న ప్రచారంపై.. వ్యాఖ్యలు చేశారు. అదంతా వైసీపీ ప్రచారమేనని.. బీజేపీ అలాంటి పని చేయదని పార్టనర్‌పై నమ్మకం వ్యక్తం చేశారు.. కానీ.. ఒక వేళ అలా చేస్తే.. బీజేపీతో ఉండనని.. ప్రకటించారు. అసలు.. రాజకీయం చేసేవాళ్లు ఇలా మాట్లాడతారా… ఇప్పుడు బీజేపీని అనుమానించినట్లే అవుతుంది. అనుమానించడం తప్పు కాదు.. కానీ ఇలా.. బయట పడకుండానే వ్యాఖ్యలు చేయడం రాజకీయ అవివేకం. ఇప్పుడు.. ఇదే కారణం చెప్పి.. పవన్ కల్యాణ్ ను బీజేపీ దూరం చేసుకోవడానికి చాన్స్ ఇచ్చినట్లయింది.

బీజేపీతో పొత్తు పెట్టుకోకముందే.. రాజధాని విషయంలో రెండు పార్టీలు గట్టిగానే పోరాడాయి. తర్వాత సైలెంటయ్యాయి. దీనిపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నంలో పవన్ కల్యాణ్‌కు క్లారిటీ లేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ అంశంపై ఒకే అభిప్రాయాన్ని గట్టిగా వినిపిస్తేనే… ప్రజల్లో కాస్తంత క్లారిటీ ఉంటుంది. లేకపోతే కష్టమవుతుంది. పవన్ కల్యాణ్.. ఈ విషయంలో.. రాజకీయ ఓనమాలు కూడా నేర్చుకున్నట్లుగా లేరు. అభిప్రాయాలు మార్చుకోనివాడు రాజకీయ నేత కాడు. కానీ ఇలా .. ఒకే వేదిక మీద.. అటూ ఇటూ.. ఏది చెప్పాలనుకుంటున్నారో… అర్థం కాకుండా మాట్లాడితే.. మొదటికే మోసం వస్తుంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com

Most Popular

ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించిన ఒడిశా

కరోనా వ్యాప్తి నివారించడానికి భారత ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 15వ తేదీన ముగియనుంది. అయితే ఏప్రిల్ 15వ తేదీకి లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం...

క‌రోనా ఎఫెక్ట్ : బొమ్మ‌కి ‘బొమ్మ’ క‌నిపించ‌డం ఖాయం

బిఫోర్ క‌రోనా - ఆఫ్ట‌ర్ క‌రోనా అని విడ‌దీసుకుని చూసుకోబోతున్నామేమో..? ప‌రిస్థితులు అలానే క‌నిపిస్తున్నాయి. ఎందుకు పుట్టిందో తెలీదు గానీ, ఈ మ‌హ‌మ్మారి వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ త‌ల‌కిందులు చేసేసింది. మ‌నిషి మ‌నుగ‌డ‌కే ప్ర‌శ్నార్థ‌కంగా...

12 గంటల్లో ఏపీలో ఒక్కటీ నమోదు కాని పాజిటివ్ కేస్.!

ఆంధ్రప్రదేశ్‌లో గత పన్నెండు గంటల్లో ఒక్కటంటే.. ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. నిన్న రాత్రి తొమ్మిది గంటల నుండి ఈ ఉదయం తొమ్మిది గంటల వరకూ... చేసిన...

అయితే పచ్చ మీడియా..లేకపోతే కులం..! వైసీపీ ఎదురుదాడి అస్త్రాలు ఈ రెండే..!?

ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్శిటీల పాలక మండళ్ల నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న దశలో.. యంత్రాంగం మొత్తం... దానిపైనే దృష్టి పెట్టినా... హఠాత్తుగా వర్శిటీల...

HOT NEWS