తోటి హీరోల తెలుగుపై పవన్ ఘాటు విమర్శలు..!

తెలుగు విషయంలో టాలీవుడ్ మొత్తంగా వ్యవహరిస్తున్న తీరుపై.. పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్.. తిరుపతిలో.. తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…తెలుగు చిత్ర పరిశ్రమ తీరుపై విమర్శలు గుప్పించారు. తెలుగు సినిమా సాహిత్యం రానురాను దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు హీరోలపైనా పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. తెలుగు హీరోలకు తెలుగు రాయటం, మాట్లాడటం రాదని ప్రకటించారు. అయినా.. తెలుగు సినిమాలతో వచ్చే డబ్బులు హీరోలకు కావాలని మండిపడ్డారు. ఏపీలో తెలుగు మీడియం రద్దుపై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు.

తెలుగు సినిమాలు తీస్తూ.. ఎవరూ మాట్లాడకపోవడంపై… విభిన్న వర్గాల నుంచి.. విమర్శలు కూడా వచ్చాయి. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు చేసి..లేని పోని చిక్కులు తెచ్చుకోవడం ఎందుకనుకున్నారేమో కానీ ఎవరూ.. నోరు విప్పలేదు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఉండి… రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్.. ఇలాంటి తీరుపై.. విమర్శలు ఎక్కుపెట్టారు. అందులోనూ… తాను హీరో అయి ఉండి..తోటి హీరోలపై గురి పెట్టడమే… చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హీరోల్లో.. ఎవరెవరికి తెలుగు చదవడం.. రాయడం వచ్చో.. క్లారిటీ లేదు కానీ… స్టార్ హీరోల్లో… మహేష్ బాబు మాత్రం.. నిజాయితీగా.. తన తెలుగు గురించి చెబుతూంటారు. తనకు తెలుగు మాట్లాడటమే..వచ్చని..చదవడం,రాయడం రాదని… చాలా సందర్భాల్లో చెప్పారు. పవన్ కల్యాణ్‌ ఏ ఇతర హీరోల గురించి చెప్పారో కానీ…టాలీవుడ్‌లో కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశంలో పవన్ టాలీవుడ్ పై విమర్శలు మాత్రమే కాదు.. మాతృభాషపై మమకారాన్ని కూడా ప్రదర్శించారు. మాతృభాష మర్చిపోతే ఎన్నో అకృత్యాలు జరుగుతాయన్నారు. సుమతి శతకాలు మనిషిని సరైన దారిలో నడిపిస్తాయని సూచించారు. జగన్‌పై పవన్‌ పరోక్ష విమర్శలు చేశారు. ఇంగ్లీష్ మాధ్యమం గొప్పది అయితే.. ఇంగ్లీష్‌లో చదివినవారు జైలుకు ఎందుకు పోయినట్టుని సెటైర్ వేశారు. పిల్లలు ఏ భాషలో చదువుకోవాలన్నది తల్లిదండ్రులకు వదిలేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఏపీలో ఉర్ధూ మీడియం స్కూళ్లు నడుస్తున్నాయ…కేవలం తెలుగు స్కూళ్లను మాత్రమే తొలగించి.. ఇంగ్లిష్ మీడియం పెడుతున్నారని మండిపడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close