జగన్ గారూ, కేసిఆర్ కోసం ఆంధ్రుల ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దు : పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో దూకుడు పెంచారు. కెసిఆర్ తో జత కట్టిన విషయంలో జగన్ ని కార్నర్ చేస్తూ, పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రసంగాలు వైఎస్ఆర్ సీపీ నేతల లో దడ పుట్టిస్తున్నాయి. ఈరోజు విజయవాడ తదితర ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ అధినేత జగన్ కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడాన్ని, కెసిఆర్ కోసం ఆంధ్రుల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం గా అభివర్ణిస్తూ తీవ్రంగా విమర్శించారు.

పవన్ కళ్యాణ్ ప్రసంగంలోని కొన్ని హైలెట్స్ ఇవే:

  • జగన్ మోహన్ రెడ్డి గారు తెలంగాణలో రాజకీయాలు చేయాలని ప్రయత్నించినప్పుడు కేసీఆర్ , వాళ్ల పార్టీ నేతలు ” నీ లాంటి నేతలు తెలంగాణకు వద్దు ” అంటూ రాళ్లతో కొట్టి జగన్ ని తరిమేశారు. తెలంగాణకు అక్కర కు రాని జగన్ ని ఆంధ్రుల మీద రుద్దటానికి కేసీఆర్ ఎందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు
  • కెసిఆర్ గారూ, మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అడుగు పెట్టాలని ఉంటే, అందులో తప్పేమీ లేదు, ఎవరి ఎక్కడి నుండి అయినా పోటీ చేయవచ్చు, మీరు కూడా ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ వచ్చి పోటీ చేస్తే ఎవరూ అభ్యంతరం పెట్టరు, కానీ ఇలా దొడ్డి దారిన జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదు.
  • జగన్ గారూ, టిఆర్ఎస్ పార్టీ తో ఎందుకని కుమ్మక్కు అవ్వాల్సి వచ్చింది? పార్లమెంట్ ఎన్నికల్లో, కొత్త పార్టీ అయిన మేము కూడా తెలంగాణలో పోటీ చేస్తున్నాము. మీరు రిజిస్టర్డ్ పార్టీ, అయి ఉండి కూడా ఎందుకని తెలంగాణ పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేయలేకపోతున్నారు. కెసిఆర్ కి సహాయం చేయడానికేనా?
  • గతంలో నేను కెసిఆర్ ని పొగిడాను అని అంటున్నారు. అది నిజమే. కానీ వ్యక్తిగత పరిచయం వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాల్లోకి వచ్చాక సొంత అన్నయ్య తో నే విభేదించిన వాణ్ణి. వ్యక్తిగత పరిచయం కలిగి ఉండి కూడా మోడీ మీద తిరగబడ్డ వాణ్ని. రాష్ట్ర ప్రయోజనాల కోసం కెసిఆర్ మీద తిరగబడ్డటానికి నాకు భయం లేదు.
  • కెసిఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ, జగన్ ఒక్కసారి కూడా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం కెసిఆర్ మీద తిరగబడ లేదు. నేను 2014లోనే వరంగల్ లో, కరీంనగర్ లో, తెలంగాణ నడిబొడ్డున కేసీఆర్ మీద తిరగబడ్డాను. ఇటు మోడీ మీద కానీ, అటు కెసిఆర్ మీద కానీ తిరగబడే ధైర్యం జగన్ కి లేదు. అందుకే కేసీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడినా జగన్ సైలెంట్ గా ఉంటున్నారు.
  • వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థులను టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి అని సంబోధించి, ఆ తర్వాత చిన్న పాజ్ ఇచ్చి, ఓహ్ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు కదా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓటు వేస్తే కేసీఆర్కు వేసినట్టే అంటూ పవన్ కళ్యాణ్ చురకలంటించారు.

మొత్తానికి తెలంగాణ ఎన్నికల సమయంలో, మన రాష్ట్ర పాలన రిమోట్ ను అమరావతి లో ఉంచనివ్వద్దు అంటూ వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ ఇప్పుడు జగన్ కి సహాయం చేయడాన్ని, జగన్ ద్వారా ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెట్టడాన్ని విమర్శిస్తూ పవన్ చేస్తున్న ప్రసంగాలకు మంచి స్పందన వస్తోంది. కెసిఆర్ తో జత కలిసి తప్పు చేశామేమో అన్న భావన ఇప్పుడు వైఎస్ఆర్సిపి నేతల్లో కనిపిస్తోంది. కెసిఆర్ తో జగన్ బంధాన్ని తూర్పారబడుతూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారం కారణంగా వైఎస్ఆర్ సీపీ నేతల లో ఆందోళన మొదలైంది.

అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ప్రచారం ఫలితాలనిస్తుందా, లేక కెసిఆర్ తో కలిసి పోయిన జగన్ కి ఓట్లు పడతాయా అన్నది తెలియాలంటే ఇంకో నెల రోజులపాటు ఆగాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close