ఆ పిచ్చి ప‌వ‌న్‌కీ ఎక్కించేశాడు

ప‌క్కా బ్రాహ్మిణ్ కుటుంబం నుంచి వ‌చ్చాడు త్రివిక్ర‌మ్‌. సంప్ర‌దాయాల్ని, ఆచారాల్నీ బాగా పాటిస్తాడు. దేవుడంటే.. భ‌క్తి, భ‌యం, న‌మ్మ‌కం..ఎక్సెట్రా ఎక్సెట్రా. దాంతో ముహూర్తాల‌పై గురి కూడా కుదిరింది. అయితే ఈమ‌ధ్య ముహూర్తాల్నిన‌మ్మ‌డం మ‌రింత ఎక్కువైంద‌ని తెలుస్తోంది. త‌న తాజా సినిమా అఆకి సంబంధించిన అన్ని ప‌నులూ ముహూర్త ప్ర‌కార‌మే చేస్తున్నాడ‌ట‌. అఆ టీజ‌ర్‌ని బుధ‌వారం సాయిత్రం 5 గంట‌ల 5 నిమిషాల‌కు విడుద‌ల చేయాల‌ని ఫిక్స‌య్యి.. అదే ఫాలో అయ్యాడ‌ట‌.

అన్న‌ట్టు ఈ పిచ్చిని త‌న ప్రియ మిత్రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కీ అంటించేశాడ‌ని టాక్‌. ప‌వ‌న్‌కూడా ఏం చేయాల‌నుకొన్నా ముహూర్తాలు చూస్తున్నాడ‌ట‌. ఆ ముహూర్తం పెట్టేది కూడా త్రివిక్ర‌మే అని టాక్‌. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా ముహూర్తం ఫిక్స్ చేసింది ఈయ‌నే అని ప‌వ‌న్ కాంపౌండ్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకొంటున్నాయి. అంతేకాదు రాత్రి 1.30 నిమిషాల‌కు బెనిఫిట్ షో వేయాల‌ని నిర్ణ‌యించిందీ ఆయ‌నేన‌ట‌. దాన్నే స‌ర్దార్ టీమ్ ఫాలో అయ్యింది. అయితే రిజ‌ల్ట్ మాత్రం తేడా కొట్టేసింది. మ‌రి అ..ఆ సంగ‌తేంటో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆంధ్రా నేతలపై వైరల్ అవుతున్న “హరీష్ సాల్వే” వ్యాఖ్యలు..!

భారత దేశంలో అత్యంత ప్రముఖ న్యాయనిపుణుల్లో ఒకరిగా ఉన్న హరీష్ సాల్వే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. న్యాయవ్యవస్థను కించ పరుస్తున్న నేతలకు గుణపాఠం నేర్పాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు....

ప్రతిపక్ష పార్టీ నేతలా పదే పదే రియాక్టవుతున్న వైసీపీ ఎంపీ..!

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఘటన జరగినప్పుడు సహజంగా.. విపక్ష పార్టీల నేతలు తక్షణం స్పందిస్తారు. అలాంటి విషయాలపై ఎలా ఎదురుదాడి చేయాలో ఆలోచించుకుని కౌంటర్‌తో ముందుకు వస్తారు అధికార పార్టీ నేతలు. కానీ.....

రైతుల్ని పారిశ్రామికవేత్తలు చేయబోతున్న కేసీఆర్..!?

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు దేశం మొత్తం ఆశ్చర్యపోయే తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఆ తీపి కబురు ఏమిటా అని.. అటు టీఆర్ఎస్‌లోనే కాదు... ఇటు విపక్ష పార్టీల్లోనూ.. చర్చ జరుగుతోంది....

అమెరికాలో విస్తరిస్తున్న  “రేసిజం వైరస్..!”

కరోనా దెబ్బకు అమెరికా వణికిపోతూంటే.. తాజాగా... పోలీసుల ఆకృత్యం వల్ల ఆఫ్రికన్ అమెరికన్ మరణించడం.. మరింతగా ఇబ్బంది పెడుతోంది. నల్ల జాతీయుడిని పోలీసుల అకారణంగా చంపడంపై నిరసనలు హింసకు దారి తీసేలా జరుగుతున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close