ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఓజీ’ ఫీవర్నే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, సినీప్రేమికులంతా ఈ సినిమా వైపు దృష్టి సారించారు. ఇంకొన్ని గంటల్లో ఓజీ థియేటర్లలో విడుదల కానుంది. అయితే రిలీజ్కు ముందు ఫ్యాన్స్కి చిన్న కలత. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చింది.
జ్వరంతోనే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పవన్, రాత్రి నుండి జ్వరం తీవ్రతరం అయింది. దీనితో వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తూ, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా జ్వరం, జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యలు వస్తున్నాయి. ఇటీవలే వర్షంలో ఓజీ ఈవెంట్కు హాజరైన పవన్ ఎక్కువ సేపు వర్షంలోనే ఉన్నారు. ఆ కారణంగానే ఆయనకు సీజనల్ ఫీవర్ వచ్చిందని తెలుస్తోంది.
