ప‌వ‌న్ ద్విపాత్రాభిన‌యం… నిజ‌మెంత‌?

ఇన్నేళ్ల సినీ జీవితంలో ప‌వ‌న్ కల్యాణ్ ఒక్క‌సారి కూడా ద్విపాత్రిభిన‌యం చేయ‌లేదు. డ్యూయెల్ రోల్ అనేది ట్రెండ్‌గా మారి, ప్ర‌తీ హీరో విధిగా ఒక్క‌సారైనా ఆ టైపు క‌థ‌ల్ని ఎంచుకుంటున్న సీజ‌న్‌లోనూ ప‌వ‌న్ వాటి జోలికి వెళ్లలేదు. ఇన్నాళ్ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ని ఓ వార్త గ‌ట్టిగా చ‌క్క‌ర్లు కొడుతోంది. ప‌వ‌న్ క‌థానాయ‌కుడిగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. విరూపాక్ష అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్ రెండు పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం మొద‌లైంది.

నిజానికి ఇందులో ప‌వ‌న్ సింగిలే. డ‌బుల్ కాదు. ఔరంగ‌జేబు ప‌రిపాల‌నా కాలం నాటి క‌థ ఇది. ప‌వ‌న్ ఓ గ‌జ‌ దొంగ‌గా న‌టిస్తున్నాడు. ప‌వ‌న్ తండ్రి, అన్న లాంటి పాత్ర‌లు ఈ సినిమాలో లేవు. పైగా క‌థంతా.. పిరియాడిక‌ల్ డ్రామానే. ప్ర‌జెంట్ – పాస్ట్ అంటూ రెండు కోణాలు కూడా లేవు. అలాంట‌ప్పుడు ఈ గాసిప్ ఎలా మొద‌లైందో ఏమో..? ఏ.ఎం.ర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బ‌డ్జెట్ రూ.100 కోట్ల‌పైమాటే. పాన్ ఇండియా రేంజులో ఈ సినిమాని విడుద‌ల చేయాల‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత ఆలోచ‌న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు రోజుల్లోనే “కుట్ర కోణం” కనిపెట్టిన డీజీపీ..!

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ ఆలయాలపై జరుగుతున్న దాడుల దర్యాప్తు విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లుగా ఉన్నారు. రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న...

ఎవరూ తగ్గరు.. మరి చర్చలెందుకు..!?

కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలు చర్చల పేరుతో దాగుడు మూతలాడుతున్నాయి. ప్రజలకు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పడానికా అన్నట్లుగా... వారానికో సారి భేటీ అవుతున్నారు. మూడు నాలుగు గంటల పాటు సమావేశం...

సంక్రాంతి షో అంతా మెగా ఫ్యామిలీదే..!

సంక్రాంతి సంబరాలు సెలబ్రిటీలు ఎలా జరుపుకుంటారనే ఆసక్తి సామాన్య జనానికి ఉంటుంది. అయితే ఎక్కువ మంది సెలబ్రిటీలు తాము ఎలా జరుపుకుంటామో బయటకు తెలియనివ్వరు. మెగా ఫ్యామిలీ ఈ ఏడాది మాత్రం.. తమ...

క్రాక్ .. పరిశ్రమకి ధైర్యం ఇచ్చింది: గోపీచంద్ మలినేనితో ఇంటర్వ్యూ

రవితేజ, గోపీచంద్ మలినేని కలసి హ్యాట్రిక్ కొట్టేశారు. సంక్రాంతి విజేతగా నిలిచింది క్రాక్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులకు హైవోల్టేజ్ వినోదం ఇచ్చింది. బాక్సాఫీసు వద్ద హంగామా చేస్తుంది. కరోనా...

HOT NEWS

[X] Close
[X] Close