పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. మిగతా హీరోల విషయంలో అయితే సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ స్టైల్ కాస్త డిఫరెంట్ కదా. అందుకే పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు ష్టార్ట్ అవుతుంది అనే విషయం తెలుసుకోవడానికి కూడా ఆయన అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అని తెలియగానే చాలా ఆనందపడిపోతారు. ఆ ఆనంద క్షణాలు ఈ రోజే స్టార్ట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ సినిమా ‘కాటమరాయుడు’ షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయింది. హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్‌లో షూటింగ్ జరుపుకుంది. ఈ షెడ్యూల్ 15 రోజులు ఉంటుంది. షూటింగ్ స్టార్ట్ అవడం లేటయినా…సమ్మర్ హాలిడేస్కి బిఫోరే రిలీజ్ చేయడం మాత్రం పక్కా అని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఇక నుంచి వరుస షెడ్యూల్స్‌లో షూటింగ్ మొత్తం పూర్తి చేస్తారట. గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్‌ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసిన డాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, శృతీ హాసన్‌లు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి.