కొత్త యేడాది పవన్ కల్యాణ్ నుంచి అభిమానులకు తీపి కబురు అందింది. పవర్ స్టార్ కొత్త సినిమా కబురు తొలి రోజే బయటకు వచ్చింది. రామ్ తాళ్లూరి నిర్మాతగా పవన్ ఓ సినిమా చేస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆయన పవన్‌కు ఇది వరకే భారీ అడ్వాన్స్ ముట్టజెప్పారు. సురేందర్ రెడ్డితో ఓకథ ఓకే చేయించారు కూడా. కానీ ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. ఎట్టకేలకు ఈ కాంబో మళ్లీ పట్టాలెక్కింది. పవన్ కల్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నట్టు నిర్మాత రామ్ తాళ్లూరి ప్రకటించారు. జైత్ర రామ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. వక్కంతం వంశీ ఈ కథ అందించారు. ఇటీవల పవన్‌ని కలిశారు వక్కంతం వంశీ. ఫైనల్ నేరేషన్ ఇచ్చారు. పవన్‌కి కథ నచ్చింది. దాంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే స్క్రిప్టు పూర్తయ్యింది. పవన్ డేట్లు బట్టి షూటింగ్ ఉండబోతోంది.
ఇది వరకే పవన్‌కు ఓ కథ వినిపించారు వక్కంతం.అయితే పవన్ బిజీ షెడ్యూల్ వల్ల.. ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే కథని కాస్త మార్చి.. సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారు. పవన్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈలోగానే సురేందర్ రెడ్డి సినిమా మొదలయ్యే ఛాన్స్వుంది.
