సుభాష్ : డైలాగులు కాదు పవన్ యాక్షన్ కావాలి !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికీ డైలాగులే చెబుతున్నారు. నేను లేస్తే మనిషిని కాదంటున్నారు. ఎప్పుడు లేస్తారో చెప్పడం లేదు. అసలు లేచే ఓపిక ఉందో లేదో కూడా స్పష్టత లేదు. వీకెండ్‌లో అమరావతి వస్తారు .. ఓ మీటింగ్ పెడతారు. అదీ కూడా ఈ మధ్యనే. ఇప్పుడు ప్రతి వీకెండ్‌తో జనవాణి పెట్టుకున్నారు. మిగతా ఆరు రోజులు సెలవు. ఆదివారం రోజున బరువైన ప్రకటనలు చేస్తారు. వెళ్తారు. అంతే.. తర్వాతేంటి అంటే స్పష్టత ఉండదు. దసరా నుంచి బస్సు యాత్ర ప్రకటించారు. కానీ ఆయన సినిమాల కమిట్‌మెంట్లు చూస్తే అది కూడా పార్ట్ టైమ్‌గా జరుగుతుందేమోనని అందరి సందేహం.

పూర్తిగా పార్ట్ టైమ్ రాజకీయానికి పరిమితమైన పవన్ !

సినిమాలు చేయనే చేయనని చెప్పిన పవన్ కల్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సినిమా తన బతుకుదెరువు అని చెప్పి.. పార్టీని నాదెండ్ల మనోహర్‌కు అప్పగించి ఆయన షూటింగ్‌లకు వెళ్లిపోతున్నారు. మొత్తం పార్టీని నాదెండ్ల నడుపుతున్నారు. ఆయన చెప్పినప్పుడల్లా ఓప్రకటన చేస్తున్నారు. లేదంటే లేదు. మూడేళ్ల పాటు అదే పరిస్థితి. జనసేన ఉందో లేదో అనుకోవాల్సిన దుస్థితి. ఇక ఎన్నికల వేడి ప్రారంభమైంది జగన్ ముందస్తుకు వెళ్తారు అనే సరికి.. వీకెండ్‌లో అయినా ఏదో ఓ కార్యక్రమం పెట్టుకోవాలని.. బయలుదేరారు.

షూటింగ్ సెలవుల్లో రైతు భరోసా యాత్ర – ఎప్పుడు పూర్తి చేస్తారు ?

పవన్ కల్యాణ్ చాలా సినిమాల కమిట్ మెంట్స్ పెట్టుకున్నారు. ఒక్కో సినిమాకు యాభై, అరవై కోట్ల సంపాదన ఉంటుంది. దాన్ని వదులుకోలేరు. వాటిని చేస్తూనే రాజకీయ పార్టీకి సమయం కేటాయించాల్సిన పరిస్థితి. అందుకే తనకు వచ్చిన రెమ్యూనరేషన్లోనే .. ఐదో..పదో కోట్లు పార్టీకి విరాళంగా ఇచ్చి. .. ఆ సొమ్మును ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకుటుంబాలకు పంచేందుదుకు జిల్లా పర్యటన ప్రారంభించారు. అది ఇప్పటికి మూడు, నాలుగు జిల్లాలోల జరిగింది. మిగతా జిల్లాలలో ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ ఈ లోపు ఆదివారాల్లో జనవాణి ప్రారంభించారు. అంటే మిగతా జిల్లాల సంగతేంటి? . బస్సు యాత్రలో కవర్ చేస్తారా ?

పార్ట్ టైమ్ కాదు ఫుల్ టైమ్ అని ప్రజల్ని నమ్మిస్తేనే ప్రయోజనం !

పవన్ కల్యాణ్‌కు ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఓటేసిన తరవాత ఆయన సినిమాలు చేసుకుంటారనే డౌటే ఎక్కువ మందికి ఉందని కొంత మంది అభిప్రాయం. ఈ విషయంలో చాలా మందికి ఏకాభిప్రాయం ఉంది. బయటపడరు కానీ జనసైనికులదీ అదే అభిప్రాయం. పవన్ కల్యాణ్ వేరే ఇతర వ్యాపారాలకు సమయం కేటాయిస్తే ఫోకస్ రాదు. పార్టీ కోసమే పని చేస్తున్నారని అనుకుంటారు. కానీ ఆయన సినిమాహీరో. వెంటనే తెలిసిపోతుంది. అందుకే.. అర్జంట్‌గా ఫుల్ టైమ్ పాలిటిక్స్‌పై పవన్ దృష్టి పెట్టాల్సి ఉంది. లేకపోతే.. రెండింటిలోనూ వైఫల్యాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

ఇప్పటికీ సభల్లో పవన్ కల్యాణ్ డైలాగులే చెబుతున్నారు. ఆ డైలాగుల్లో చాలా హామీలు.. చాలెంజ్‌లు ఉంటాయి. కానీ వాటిని పాటించడానికి సీరియస్‌గా తీసుకుంటున్న చర్యలేమీ లేవు. అందుకే పవన్ రివ్యూ చేసుకోవాలి. మార్చుకోవాలి. లేకపోతే.. ఆయన తీరును సినిమా షూటింగ్‌లాగే జనం తీసుకుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ని వెంటాడుతున్న `రెబ‌ల్‌` భ‌యం

స‌లార్ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. సెప్టెంబ‌రు 28, 2023న ఈ సినిమాని రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. దాంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలైపోయారు. ఎందుకంటే ఇలాంటి అప్ డేట్ కోస‌మే వాళ్లు...

కులాల లెక్కలేసుకుంటే జనసేనకు 40 సీట్లొచ్చేవి : పవన్

కుల , మతాలు లేని రాజకీయం రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. మంగళగిరిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరించిన తర్వాత మాట్లాడారు. ఈ సందర్భంగా కుల, మతాల...

‘స‌లార్’ అప్‌డేట్‌: రిలీజ్ డేట్ ఫిక్స్‌

ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచో.. ఎదురుచూస్తున్న అప్ డేట్ వ‌చ్చేసింది. 'స‌లార్‌' రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ...

బింబిసార విజయ రహస్యం ఇదేనా?

కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్ కి రావడం తగ్గిపోయిందనే మాట సర్వాత్ర వినిపిస్తోంది. దీనికి కారణం ఓటీటీ ప్రభావమని కొందరంటే.. సినిమా టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచి మళ్ళీ తగ్గించి ప్రేక్షకుడికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close