వైసీపీ, జనసేనలను కలిపే ప్రయత్నంలో టీఆర్ఎస్..! పవన్ బయటపెట్టిన నిజం..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్… జిల్లాల వారీగా.. సమీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో… చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. పొత్తుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు… ప్రయత్నిస్తున్నారని.. వారు టీఆర్ఎస్ నేతలతో తనతో మాట్లాడిస్తున్నారని సంచనల ప్రకటన చేశారు. జనసేనకు ఎలాంటి బలం లేదని.. ఆయనతో పొత్తులు అవసరం లేదని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు ప్రకటిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే పవన్ కల్యాణ్.. ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు బలం లేదని చెప్పిన పార్టీ .. తమతో పొత్తు కోసం.. టీఆర్ఎస్ నేతల ద్వారా రాయబారానికి ప్రయత్నిస్తోందనేది ఆయన చెప్పిన మాట. అయితే.. ఏ టీఆర్ఎస్ నేత ఆయనతో టచ్‌లోకి వచ్చారు..? వైసీపీతో పొత్తు పెట్టుకోమని.. ఎలాంటి ప్రతిపాదనలు తెచ్చారన్న దానిపై పవన్ కల్యాణ్ స్పందించలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో సామాజికవర్గాల సమీకరణల ప్రకారం చూస్తే.. జగన్, పవన్ కలిస్తే… తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరం అని.. విడివిడిగా పోటీ చేస్తే.. ఓట్లు చీలి.. టీడీపీ ఘన విజయం సాధిస్తుందన్న ఓ అంచనా ఉంది. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామన్న .. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. జగన్ , పవన్ లను కలిపి.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనిపై.. అంతర్గతంగా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో మాత్రం బయటకు రాలేదు. అటు జగన్ తోనూ.. ఇటు పవన్ తోనూ.. టీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ అయితే.. కేసీఆర్ ను.. “హీరో క్యారెక్టర్” గా భావిస్తున్నారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా.. కేసీఆర్ పట్ల అమితమైన గౌరవాన్ని ప్రదర్శిస్తూంటారు. కేసీఆర్ చెబితే.. ఇద్దరూ చేతులు కలుపుతారని.. భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్… ప్రయత్నాలు ప్రారంభించిందని… పవన్ వ్యాఖ్యల ద్వారా బయటకు రావడం కలకలం రేపుతోంది.

జగన్‌తో పవన్ కల్యాణ్ కలుస్తారో లేదో కానీ… వారిద్దిరి మధ్య పొత్తుల కోసం చాలా తీవ్రమైన ప్రయత్నలే జరుగుతున్న విషయం మాత్రం.. పవన్ మాటల ద్వారా తేలిపోతోంది. గతంలోనే… ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల చర్చలు జరిగాయన్న… ప్రచారం సాగింది. కానీ… ఈ వార్తలను ఆయా పార్టీలు ఖండించాయి. ఇప్పుడు పవన్ కల్యాణే.. నేరుగా.. వైసీపీ పొత్తుల కోసం.. టీఆర్ఎస్ నేతల ద్వారా సంప్రదిస్తోందని… ప్రకటించడంతో… రాజకీయంగా కీలక పరిణామాలు ఖాయమని తేలిపోయింది. ఇంతకీ.. పవన్ ను సంప్రదించిన టీఆర్ఎస్ నాయకులు ఎవరు..? పవన్ కల్యాణ్ వద్దకు ఏ ప్రతిపాదనలతో వచ్చారు..? జగన్ కోసం.. టీఆర్ఎస్ నేతలు పని చేయాల్సిన అవసరం ఏమిటి..? అన్నవి ప్రధాన సందేహాలుగా మిగిలిపోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close