సేవ చేస్తున్న అభిమానానికి ధన్యవాదాలు : పవన్ కల్యాణ్

సెప్టెంబర్ 2 తన పుట్టిన రోజు సందర్భంగా.. అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జనసైనికులు, నాయకులు, వీర మహిళలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ కిట్లు వితరణ పై అభినందనలు తెలిపారు. ఇప్పుడున్న ఆరోగ్య విపత్కర పరిస్థితుల్లో జనసేన శ్రేణులు, నాయకులు, అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడతాయని సంతృప్తి వ్యక్తం చేసారు. తమ అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు సామాజిక సేవా మార్గాన్ని ఎంచుకోవడాన్ని ఎప్పటికీ మరచిపోనననారు. ఈ సందర్భంగా తనకు పుట్టిన రోజు చేసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదనే విషయాన్ని పవన్ కల్యాణ్ అభిమానులకు చెప్పారు. పుట్టిన రోజు అంటే చిన్నప్పుడు ఒకటి, రెండు సందర్భాల్లో స్కూల్లో చాక్లెట్లు పంచినట్లు గుర్తు.ని… తర్వాత చాలా ఏళ్ల పాటు పుట్టిన రోజునే మర్చిపోయానన్నారు. పుట్టినరోజు అయిపోయిన రెండు రోజుల తర్వాత ఇంట్లో ఎవరికో ఒకరికి గుర్తొచ్చేదని.. అలా గుర్తొచ్చినప్పుడు వదిన డబ్బులు ఇస్తే పుస్తకాలు కొనుక్కునేవాడినని గుర్తు చేసుకున్నారు. అంతకుమించి ప్రత్యేకంగా బర్త్‌డే జరుపుకోవడం అలవాటు లేదన్నారు.

సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్నేహితులు, నిర్మాతలు పుట్టిన రోజు వేడుకలు చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బందిగా ఉండేదని.. కేక్ కట్ చేయడం, ఆ కేక్ తీసుకొచ్చి నా నోట్లో పెట్టడం ఎబ్బెట్టుగా అనిపించి మానేశానన్నారు. అంతే తప్ప ప్రత్యేకంగా వేరే కారణాలు ఏమీ లేవన్నారు. అభిమానులు చూపుతున్న అభిమానంపైనా పవన్ తనదైన శైలిలో స్పందించారు. లక్షలాది మంది అభిమానించడం, అదరించడం చూస్తుంటే తనకే ఆశ్చర్యంగా ఉంటుందన్నారు. సుస్వాగతం సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ లో ఫంక్షన్ ఉంది తప్పకుండా రావాలంటే ఇబ్బంది పడుతూనే కర్నూలు వెళ్లానని.. వాహనం ఎక్కేటప్పటికీ దారి పొడువునా విపరీతమైన జనం ఉన్నారని గుర్తు చేసుకున్నారు. వాళ్లకు తనకు మధ్య పెద్ద తేడా లేదని అప్పుడే అనుకున్నానని.. వాళ్లు అటువైపు ఉన్నారు… నేను ఇటువైపు ఉన్నాను అంతే అన్నారు. తనను ప్రత్యేకంగా చూస్తున్నారనే ఆలోచన విధానం ఎప్పుడూ లేదని పవన్ స్పష్టం చేశారు.

తన ప్రమేయం లేకుండానే పుట్టిన రోజును పురస్కరించుకొని సేవా వారోత్సవాలు చేస్తున్నారంటే .. అది జన సైనికులు, వీర మహిళలు, అభిమానుల గొప్పతనమని ప్రశంసించారు. అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానం సమాజానికి ఉపయోగపడితే నిజంగా చాలా తృప్తిగా ఉంటుంది. ఇందుకు భగవంతుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. పవన్ పుట్టిన రోజును.. ఘనంగా జరిపేందుకు అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close