ప‌వ‌ర్ స్టార్ కొత్త పాత్ర‌

చేనేతకు సెల‌బ్రిటీ చేయూత‌ ల‌భించింది. నేత‌న్న‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అండ దొరికింది. చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి ప‌వ‌ర్ స్టార్ అంగీక‌రించారు. తెలంగాణ‌, ఏపీ చేనేత కార్మిక సంఘాల ప్ర‌తినిధుల‌కు స్వ‌యంగా హామీ ఇచ్చారు.

తెలంగాణ అఖిల‌ప‌క్ష చేనేత ఐక్య వేదిక ప్ర‌తినిధులు, ఏపీ కార్మిక సంఘం నాయ‌కులు జ‌న‌సేన కార్యాల‌యంలో ప‌వ‌న్ ను క‌లిశారు. త‌మ స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించుకున్నారు. చేన‌త రంగం దుస్థితిని వివ‌రించారు. గ‌త రెండున్నర సంవ‌త్స‌రాల్లో కేవ‌లం తెలంగాన‌లో 45 మంది చేనేత కార్మికులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని చెప్పారు. ఈ వివ‌రాలు విన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌లించిపోయారు. చేనేత‌కు తాను అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. బ్రాండ్ అంబాసిడ‌ర్ గా చేనేత వ‌స్త్రాల‌ను ప్ర‌మోట్ చేస్తాన‌ని వాగ్దానం చేశారు.

ఉద్దానం కిడ్నీ బాధితుల ప‌క్షాన నిల‌బ‌డిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు చేనేత కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌నున్నారు. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టుడు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారి, చేనేత వ‌స్త్రాల‌ను ధ‌రించాల‌ని పిలుపునిస్తే అది క‌చ్చితంగా నేత‌న్న‌ల ఉత్ప‌త్తుల సేల్స్ పెంచుతుంద‌ని ఆశిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

తేజూ టైటిల్‌: ‘రిప‌బ్లిక్‌’

సాయిధ‌ర‌మ్ తేజ్ - దేవాక‌ట్టా కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి `రిప‌బ్లిక్‌` అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈరోజు మోష‌న్ పోస్ట‌ర్ కూడా విడుద‌ల...

కేంద్ర బలగాలు, సిబ్బందితో ఎన్నికల నిర్వహణ..!?

సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికల ప్రక్రియను రీ షెడ్యూల్ చేశారు. లెక్క ప్రకారం ఈ రోజు నుంచి మొదటి...

సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు, మెత్తబడ్డ ఉద్యోగ సంఘాలు

ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికలు ఇప్పుడు నిర్వహించాలంటూ కోర్టుకెక్కిన ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు సుప్రీంకోర్టు నిర్ణయం ఝలక్ అని చెప్పవచ్చు. అయితే దీని కంటే...

పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే : సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి అనుకూల తీర్పు రాలేదు. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే...

HOT NEWS

[X] Close
[X] Close