హ‌రీష్ శంక‌ర్ సినిమా ముందుకు.. క్రిష్ సినిమా వెన‌క్కి?

ప‌వ‌న్ క‌ల్యాణ్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. ముందు అనుకున్న ప్ర‌కారం క్రిష్ సినిమా పూర్తి చేయాలి. ఆ త‌ర‌వాత `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్` ఉంటుంది. అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆలోచ‌న‌లు మారాయి. ఈ రెండు సినిమాల‌కంటే.. హ‌రీష్ శంక‌ర్ సినిమాని ముందు పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడ‌ట‌. హ‌రీష్ బౌండెడ్ స్క్రిప్టుతో రెడీగా ఉన్నాడు. `కేవ‌లం 60 రోజులు కాల్షీట్లు ఇస్తేచాలు.. సినిమా పూర్తి చేస్తా` అని ప‌వ‌న్ కి హ‌రీష్ రిక్వెస్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈసినిమాని కేవ‌లం 3 నెల‌ల్లో పూర్తి చేయాల‌ని హ‌రీష్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. క్రిష్ సినిమా అలా కాదు.. అదో సుదీర్ఘ ప్ర‌యాణం. 2022 జ‌న‌వ‌రి కి ఈ సినిమాని తీసుకురావాల‌ని ఆలోచిస్తున్నారు. అంత‌కంటే ముందు హ‌రీష్ సినిమాని పూర్తి చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్`కి ప‌వ‌న్ మ‌రో 20 రోజులు కాల్షీట్లు ఇస్తే స‌రిపోతుంద‌ని స‌మాచారం. అందుకే హ‌రీష్ సినిమాకీ, మ‌ల‌యాళం రీమేక్ నీ స‌మాంత‌రంగా పూర్తి చేయాల‌ని భావిస్తున్నాడు ప‌వ‌న్‌. అచ్చం ఇలానే జ‌రిగితే ముందు `అప్ప‌య్య‌యుమ్ కోషియ‌మ్‌` విడుద‌ల అవుతుంది. ఈ త‌ర‌వాత క్రిష్ సినిమా వ‌స్తుంది. 2022 వేస‌వికి… హ‌రీష్ సినిమా విడుద‌ల‌య్యే ఛాన్సులున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కత్తి మహేష్ టెంప్లేట్ వైకాపా వదలదా? కత్తి స్థానాన్ని పోసాని భర్తీ చేయగలరా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్సిపి మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలి అన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్...

పోసాని మళ్లీ రచ్చ – దాడికి ప్రయత్నించిన పవన్ ఫ్యాన్స్ !

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి "పవన్ నీకెంత...

ప్రజల వరద కష్టాల కన్నా మీడియాకు సినిమా గొడవలే మిన్న !

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ తేరుకోలేదు. కొన్ని వందల గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఇక నష్టపోయిన వారి గురించిచెప్పాల్సిన...

పంజాబ్ కాంగ్రెస్ చిందర వందర !

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్... పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే...

HOT NEWS

[X] Close
[X] Close