పవన్ కల్యాణ్‌కు మంచి ఐడియా ఇచ్చిన రేవంత్..!

యూరేనియం విషయంలో పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్‌లో పోరాటం చేసేలా… కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. నల్లమలలో పవన్ కల్యాణ్ పర్యటించినా… లేకపోయినా… కడప జిల్లాలో మాత్రం కచ్చితంగా పోరాటం చేయాలన్నట్లుగా… ఆయనను మానసికంగా సిద్ధం చేసే ప్రయత్నం చేశారు. యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో… పలువురు నేతలు..పాల్గొన్నారు. యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించారు. అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్ సభ ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించారని.. స్టేట్‌ ఫారెస్ట్‌ అడ్వైజరీ అనుమతిలేకుండా.. ఫారెస్ట్‌లో తవ్వకాలు జరగకూడదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్లమలలో తవ్వకాల కోసం 2016లో తీర్మానం చేశారని .. కేసీఆర్‌, కేటీఆర్‌ కాంగ్రెస్‌పై నెపం నెడుతున్నారని విమర్శించారు. అదే సమయంలో పోరాట ప్రణాళిక గురించి రేవంత్ ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌ నల్లమలతో పాటు కడప జిల్లాలోనూ పర్యటించాలని.. అక్కడికి తవ్వకాల కోసం వెళ్ళే వారిని ఆపాలని కోరారు.

పులివెందుల నియోజకవర్గంలోని తుమ్మలపల్లిలో యురేనియం కర్మాగారం ఉంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో..యురేనియం ప్లాంట్ పెట్టడానికి ఏ రాష్ట్రమూ ఒప్పుకోకపోవడంతో… హైకమాండ్ వద్ద మెప్పు పొందడానికి పులివెందులలో ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. దాని ప్రకారం 2006లో తుమ్మలపల్లిలో దాదాపు పది లక్షల టన్నుల ముడి యురేనియాన్ని శుద్ధి చేసే ప్లాంటును నెలకొల్పారు. కాలుష్యమే ఉండదని ప్రజలను మభ్యపెట్టారు. యురేనియం ప్రాసెసింగ్‌ కేంద్రంలో స్థానిక యువతకే ఉపాధి కల్పిస్తామంటూ భరోసా ఇవ్వడంతోనే.. ప్రాసెసింగ్‌ కేంద్రం ఏర్పాటుకు గ్రామస్థులు అంగీకరించారు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. యూరేనియం కాలుష్యంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ కలుషితం అయ్యాయి. వాటిపై పోరాడాలని రేవంత్.. పవన్ కల్యాణ్ కు సూచించారు.

ప్రస్తుతం.. యూరేనియం తవ్వకాలు చేయాలనుకుంటున్న నల్లమల… తెలంగాణలోఎక్కువగా ఉంది. సేవ్ నల్లమల పేరుతో ఉద్యమం జరుగుతోంది. కడప జిల్లాలో అడవి లేదని.. అలాగే గిరిజనులు కూడా లేరని.. అక్కడ గ్రామాల మధ్య ప్లాంట్ ఉందని…వారి కోసం పోరాడాల్సిన అవసరం ఉందని రేవంత్ చెబుతున్నారు. నిజానికి తుమ్మల పల్లి యూరేనియం విషయం ఇప్పుడిప్పుడే ప్రజాఉద్యమానికి దారి తీస్తోంది. రేవంత్ సలహాలను పవన్ కల్యాణ్ పాటిస్తే పొలిటికల్ మైలేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close