తెలకపల్లి రవి : లెఫ్ట్‌కోసం కాదు, దుష్చ్రచాలపైనే ఆ కామెంట్స్‌

జనసేన అద్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల పొత్తులకు సంబంధించి పెట్టిన ట్వీట్లపై రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నది కొంతమంది కావాలని చేస్తున్న దుష్ప్రచారాలపైనేనని కొందరు నాయకులు భావిస్తున్నారు. ఉదాహరణకు ఈ రోజు కూడా ఆంధ్రజ్యోతిలో జనసేనకూ వైసీపీకి పొత్తు ఖాయమైనట్టే కథనం రాశారని వారు ఉదహరించారు. ఈ కథలు పటాపంచలు చేసేందుకే మాకు ఏ పెద్దపార్టీ అండ అక్కర్లేదని పవన్‌ వ్యాఖ్యానించారని ఒక ముఖ్య ప్రతినిది వివరణ ఇచ్చారు. ఈ ట్వీట్లు వామపక్షాలకు వర్తించేవి కావనడానికి రెండు కారణాలు చెప్పారు.

మొదటిది- పులి ,తోక వంటి నెగిటివ్‌ మాటలు పవన్‌ వామపక్షాలపై వుపయోగించే అవకాశం లేదు.మొదటి నుంచి ఆయనకు వామపక్షాల పట్ల సదభిప్రాయమే వుంది గనక ఇలాటి భాష వాడరు. కొంతమంది దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాలకు కోపం వచ్చి ఈ ట్వీట్టు చేశారు.

రెండు- మాకు పెద్ద పార్టీ అండ అవసరం లేదన్నప్పుడు వామపక్షాలకంటే మేమే పెద్ద పార్టీగా వుంటాము. అన్ని చోట్లా పోటీ చేస్తాము. కనక ఆ రీత్యా కూడా వారికి వర్తించదు.

అయితే ఈ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్ల వల్ల అనవరసర గందరగోళం ఏర్పడిందని మరో నాయకుడు అభిప్రాయపడ్డారు.ఈలోగాో జనసేన తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను బలపరుస్తుందనే కథలు కూడా నిజం కాదనీ దాని ప్రభావం ఎపిపై పడుతుందని తమకు తెలుసనీ ఆయన అన్నారు. దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందనేది వారి భావనగా వుంది.

గతంలో నాగబాబు, ఇటీవల రామ్‌చరణ్‌తాజాగా తల్లి అంజనా దేవి పవన్‌కు తోడుగా రావడం కుటుంబం ఆయనతో వుందనేందుకు నిదర్శనమని జనసేన నేతలు చెబుతున్నారు. చిరంజీవి రాజకీయ వేదికపై రాకున్నా సినిమా వేడుకల్లో చాలాసార్లు కనిపించిన సంగతి గుర్తుచేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ “రండ” రచ్చ !

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం బీజేపీని కిషన్ రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కేంద్రం ధాన్యం కొనబోమని చెప్పిందని .. కానీ కిషన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అయన...

పాజిటివ్ స్టెప్‌తో టీ కాంగ్రెస్‌కు టీఆర్ఎస్‌ షాక్ !

కాంగ్రెస్ విషయంలో టీఆర్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలు అనూహ్యంగా ఉంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా ఢిల్లీలో టీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి భేటీకి టీఆర్ఎస్ నేత కేశవరావు...

సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత

దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల సిరివెన్నెల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. చికిత్స కోసం ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్సపొందుతూ కొద్దిసేపటిక్రితం తుది శ్వాశ...

అత్యంత విష‌మంగా సీతారామ‌శాస్త్రి ఆరోగ్యం

ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత సీతారామ‌శాస్త్రి ఆరోగ్యం అత్యంత విష‌మ ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆసుప‌త్రిలో చేరిన...

HOT NEWS

[X] Close
[X] Close