శ్రీకాకుళం లో “చీకటి పరిస్థితి” ని, వెలుగులోకి తెచ్చిన పవన్

శ్రీకాకుళం జిల్లాని తితిలి తుఫాను చిదిమేసింది. అనేకమంది నిరాశ్రయులు కావడమే కాకుండా మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలాచోట్ల ఇప్పటికీ కరెంటు పునరుద్ధరించబడక పోవడంతో ప్రజలు చీకట్లో మగ్గిపోతున్నారు. ఆ చీకట్లో , ఆ ప్రజలతో తాను దసరా జరుపుకుంటున్నట్టు ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ, “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను శ్రీకాకుళం లో ఉన్నానని కనిపించట్లేదో , గుర్తించాలనికోవట్లేదో తెలియట్లేదు కానీ ,నేను పలాస నియోజకవర్గము లోని నువ్వులు పాలెంలో,కటికి చీకట్లో దసరా పండుగని శ్రీకాకుళం తుఫాను భాదితులతో జరుపుకొని వస్తున్నాను…” అన్నారు. అలాగే ఆ చీకట్లో ప్రజలతో కలిసి ఉన్న వీడియోని పవన్కళ్యాణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.‌

శ్రీకాకుళంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చాలా వరకు తెలియడం లేదు. దాదాపు మీడియా మొత్తం ఏకమై, ప్రభుత్వం అద్భుతంగా పనిచేసి శ్రీకాకుళం లో పరిస్థితులన్నింటినీ చక్క బెడుతోందని, ప్రజలందరూ చంద్రబాబు మరియు అధికార యంత్రాంగం పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారని ప్రసారం చేయడంతో క్షేత్ర స్థాయి పరిస్థితులు కేవలం అక్కడి ప్రజలకు మాత్రమే తెలుస్తోంది. ఆ క్షేత్రస్థాయి పరిస్థితులను, ప్రభుత్వ వైఫల్యాలను, తద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ ప్రపంచానికి చూపిస్తున్నారు. శ్రీకాకుళంలో పలాస నియోజకవర్గంలో, ఇప్పటికీ విద్యుత్ పునరుద్ధరించబడకపోవడాన్ని ప్రభుత్వానికి గుర్తు చేయడంతో పాటు, పవన్ కళ్యాణ్ ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఎద్దేవా చేస్తున్న అధికార పార్టీ నాయకులకు ఝలక్ ఇచ్చేలా పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేశాడు. అలాగే, ఒక గ్రామంలో నిరాశ్రయులైన 30 కుటుంబాలకి కలిపి, కూరగాయల కోసం ప్రభుత్వం 500 రూపాయలు ఇవ్వడాన్ని వేలెత్తి చూపడం ద్వారా నాణేనికి మరోవైపు ఏముందనేది ప్రజలకు తెలిసేలా చేశాడు.

అలాగే జన్మభూమి కమిటీల మీద శ్రీకాకుళం వాసుల్లో ఉన్న ఆగ్రహాన్ని మరొక వీడియో ద్వారా ప్రభుత్వానికి తెలిసేలా చేశాడు పవన్ కళ్యాణ్. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి , జన్మభూమి కమిటీలు గురించి సగటు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటే – ‘ నేను యీ రోజు పలాస నియోజకవర్గం లోని ( అల్లుడు టాక్స్ నియోజక వర్గం-నా మాట కాదు – ప్రజల మాట) నువ్వులువాని పాలెంలోతీసిన చూడండి’” అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు.

ఏది ఏమైనా, శ్రీకాకుళం లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, నాణేనికి మరొకవైపు ఎలా ఉందో పవన్ కళ్యాణ్ ట్వీట్ల ద్వారా ప్రపంచానికి తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close