మార్చిలో రాబోతున్న సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ‘గబ్బర్ సింగ్’ తరవాత వీరిద్దరూ కలిసి పని చేశారు కాబట్టి… అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానికి తోడు ‘ఓజీ’తో పవన్ ఓ సూపర్ హిట్టు కొట్టారు. ఆ ఉత్సాహంతోనే ఈ సినిమా పూర్తి చేశారు. మార్చి 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
ఇప్పటికే రెండు పాటల్ని విడుదల చేశారు. మరో రెండు పాటలు రావాల్సివుంది. ఆ రెండు పాటలకు సంబంధించిన కంటెంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ట్రైలర్ కట్ పనిలో పడింది చిత్రబృందం. ప్రస్తుతం హరీష్ శంకర్ ట్రైలర్‌ని కట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈసారి పవర్ ప్యాక్డ్ ట్రైలర్ రాబోతోంది. సింగిల్ లైనర్లకు హరీష్ పెట్టింది పేరు. ఈ ట్రైలర్లో కూడా అవి గట్టిగానే పేలబోతున్నాయని టాక్. మార్చి రెండో వారంలో ట్రైలర్ వదులుతారు. అంతకు ముందు ఓ చిన్న పాటి గ్లింప్స్ కూడా బయటకు వచ్చే ఛాన్సుంది. ట్రైలర్ వచ్చాకే మిగిలిన రెండు పాటలూ విడుదల చేస్తారు. ఆ తరవాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. అలా.. మార్చి మొత్తం ‘ఉస్తాద్’ ప్రమోషన్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.
