పవన్ కల్యాణ్ సినిమాల్లో తన పాత కమిట్మెంట్లను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా తక్కువ కాల్ షీట్లతో వాటిని పూర్తి చేసేలా ప్రయత్నిస్తున్నారు. తీరిక సమయాల్లో నటిస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడం.. అంటే ఓటర్లను అవమానపరినట్లేనని అంటున్నారు. అయితే వారి వాదన వారికే రివర్స్ అవుతోంది. అసెంబ్లీకి వెళ్లని జగన్ రెడ్డి ఓటర్లకు న్యాయం చేస్తూ.. పవన్ అన్యాయం చేస్తున్నారా అన్న సూటి ప్రశ్నలు వస్తున్నాయి.
పాత కమిట్మెంట్స్ పూర్తి చేస్తున్న పవన్
ఎన్నికలకు ముందు పవన్ కొన్ని సినిమాలు అంగీకరించారు. ఎన్నికల తర్వాత ఆయన చాలా కాలం వాటిని హోల్డ్ లో పెట్టారు. తన మీద వందల కోట్లు పెట్టుబడిగా పెట్టి సినిమాలు తీస్తున్నారు. అయినప్పటికీ వారికి నష్టం అయినా.. వాయిదాలు వేస్తూ వచ్చారు. ఇప్పుడు వాటిని పూర్తి చేయాల్సిన అవసరం పడింది. పవన్ కల్యాణ్ కు అది నైతిక బాధ్యత. వారాంతాల్లో ఇతర సెలవు రోజుల్లో వాటిని పూర్తి చేస్తున్నారు. ఇందులో తప్పు పట్టడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే రాజకీయ నేతలు అయినంత మాత్రాన.. ఎవరూ వ్యాపారాలు చేయడం మానడం లేదు. అలాగే పవన్ కూడా.. తన వృత్తిలో తన గెలుపునకు ముందు కమిటీ మెంట్స్ పూర్తి చేయాలనుకుంటున్నారు. దాన్నే తప్పన్నట్లుగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
జగన్ చేస్తున్నదేమిటి ?
జగన్ రెడ్డి వ్యాపారాలు మానలేదు. ఆ విషయం పక్కన పెడితే ప్రజలు ఓట్లు వేసి అసెంబ్లీకి వెళ్లాలని పంపిస్తే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఆయన అసెంబ్లీకి వెళ్లడం లేదు. ఇది అసలైన ప్రజాద్రోహం. ప్రజలు ఓట్లు వేసే ప్రధాన కారణం.. చట్టసభల్లో తమ వాయస్ వినిపిస్తారనే . కానీ జగన్ రెడ్డి తాను మాత్రమే కాదు.. తన ఎమ్మెల్యేలను కూడా పంపడం లేదు. ఇంత కంటే ప్రజలను.. ఓటర్లను మోసం చేసే వారు ఎవరు ఉంటారు ?
వైసీపీ చేసేదే తప్పు.. ఇతరులపై బురద వేయడం హాబీ !
వైసీపీ రాజకీయం అత్యంత ఘోరంగా ఉంటుంది. చేయాల్సిన తప్పుడు పనులన్నీ చేసేస్తూ ఎదుటి వారే అలాంటివి చేసేస్తున్నారని బురద చల్లేస్తూ ఉంటారు. ఇలాంటి రాజకీయాలతో వైసీపీ పూర్తిగా విశ్వసనీయత కోల్పోయింది. ముందుగా వైసీపీ నేతలు తమ నిజాయితీని నిరూపించుకోవాలి. తర్వాతే ఇతరులపై విమర్శలు చేయాలి.