సుభాష్ : కమ్యూనిస్ట్ భావజాల మత రాజకీయం..! పవన్ స్టైలే వేరు..!

పెద్దలు పుస్తకాలు ఎందుకు చదవమంటారు..?
జీవితం తెలుస్తుందని.. లోకజ్ఞానం అలవడుతుందని…ఆలోచనలు విశాలంగా మారతాయని పుస్తకాలు చదవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రపంచంలో ఉన్న మేధావులంతా.. పుస్తకాలు చదివిన వాళ్లే. అన్ని రకాలుగా విజ్ఞానాన్ని సముపార్జించుకున్నవాళ్లే. అలా అని పుస్తకాలు చదివిన వాళ్లు మాత్రమే మేధావులైపోరు. జీవితాన్ని చదివిన వారు కూడా ఆ కేటగిరిలోకి వస్తారు. కానీ.. ఇక్కడ సమస్య అంతా పుస్తకాలు చదవకుండా… ” మేధావులకు మాత్రమే అనబడే ” పుస్తకాలతో ఫోటో షూట్‌లు చేసుకునే వారితోనే వస్తోంది. తాను మేధావినని.. చర్యలతో కాకుండా.. పుస్తకాలతో ఫోటో షూట్ల ద్వారా ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం ద్వారానో వస్తోంది. చివరికి అది కామెడీ అయిపోతోంది. ప్రస్తుతం ఆ పొజిషన్‌లో మన దగ్గర ఒకరున్నారు. ఆయనే అభినవ చెగువేరా .. జనసేన అధినేత పవన్ కల్యాణ్.

చదివేసిన “చే” పోరాటాలు స్ఫూర్తి నింపలేకపోయాయా పవన్ చే..!

పోరాడితే పోయేదేం లేదు .. బానిస సంకెళ్లు అనే కాన్సెప్ట్‌తో ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేశారు. అలాంటి వారందరూ అత్యధికులు విప్లవయోధులే. ప్రజల కోసం పోరాడిన వారే. తమకేం వస్తుందని ఆశించని వారే. నిజానికి ఏ దేశం అయినా కాస్త నిలబడిందంటే.. ఇలా నిస్వార్థంగా ప్రజల కోసం నిలబడిన నాయకులు ఉండబట్టే. అందుకే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అలాంటి నేతలను ఆదర్శంగా తీసుకున్నానని చెబుతూ ఉంటారు. పుస్తకాలు చదివేటప్పుడు రక్తం మరిగిపోతూంటుందని.. ఆవేశ పడుతూంటారు. అయితే.. ఇప్పుడు పవన్ కల్యాణ్ చేస్తున్న పనులు.. చేస్తున్న ప్రకటనలు… తీరు మార్చుకుంటున్న రాజకీయం.. అన్నీ ఆయనను కామెడిగా మార్చేస్తున్నాయి. ఇంత కాలం చదివిందేంటి… ఇప్పుడు చేస్తున్నదేమిటనే చర్చ.. అంతటా సాగుతోంది. మతం పేరుతో కొత్తగా రాజకీయం చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడకపోవడం ఏమిటన్న చర్చ నడుస్తోంది. పవన్ కల్యాణ్ పుస్తకాల చదువులపైనే అందరికీ సందేహాలు వస్తున్నాయి.

కల్తీ భావజాలంతోనే అసలు సమస్యంతా వస్తోంది పవన్ చే..!

పవన్ కల్యాణ్ తనవి కమ్యూనిస్టు భావాలని చెప్పుకున్నారు. వారితో పొత్తులు పెట్టుకున్నారు. అంతకు ముందే తనకు మోడీ అంటే ఇష్టమన్నారు. మోడీ – కమ్యూనిస్టు ఈ రెండు పదాలు.. నక్కకు.. నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. పవన్‌వి నిజంగా కమ్యూనిస్టు భావాలే అయినా.. మోడీ ఆయనకు సమాజానికి విరోధిలాగా కనిపించాలి. కానీ.. భావజాలంలోనే కల్తీ ఏర్పడిపోయింది. తనకు కమ్యూనిస్టు భావాలే అయిన మోడీ అంటే ఇష్టమని.. ఆయన చేసే పనులంటే ఇంకా ఇష్టమని…చెప్పడం… సమాజంలో సమానత్వం కోసం ప్రయత్నిస్తానని చెప్పుకుని మత పరంగా విభజన కోసం పని చేయడం.. పైగా ఇతర మతాలు ఏమనుకుంటాయోనని భయం లేదని ప్రకటనలు చేయడం.. తనకు మించిన హిందూత్వ వాది లేరన్నట్లుగా… పువ్వుల్లో దీపాలు పెట్టి హడావుడి చేయడం.. అన్నీ.. కల్తీ భావజాలం వల్ల వస్తున్న సమస్యలే.

“చెగువేరా” జీవితం చదివారా..? స్టైల్ ఐకాన్‌గా వాడుకన్నారా..?

పవన్ కల్యాణ్ చెగువెరా గురించి తరచూ చెబుతూంటారు. సోషల్ మీడియా ఉద్ధృతి లేని సమయంలో పుస్తకాల ద్వారా చాలా కొద్ది మందికి మాత్రమే పరిచయం ఉన్న విప్లవయోధుడు చే. ఆయన ఎక్కడ పోరాటం చేశారు.. ఎవరిపై పోరాటం చేశారు అన్న విషయాలు కాదు ముఖ్యం.. చాలా చిన్న వయసులోనే ఆయన సాధించిన విప్లవం ముఖ్యం. దాని నుంచి స్ఫూర్తి పొందడానికే.. ప్రాణాలొడ్డి ఆయన చేసిన పోరాటాలను కథలు..కథలుగా చెప్పుకుంటారు. ఆయన భావజాలాన్ని విశ్లేషించుకుంటారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదటి నుంచి చేగువేరా తనకు స్ఫూర్తి అని చెబుతూ ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే కాదు.. రాక ముందు కూడా. తననో రెబల్‌గా చిత్రీకరించుకునేందుకు ఆయన చేను ఆదర్శంగా తీసుకున్నారు. సినిమాల్లో ఆయనలా మేకప్‌లు కూడా వేయించుకున్నారు. తాను రెబలిజంను నమ్ముతానని.. తిరగబడతానని.. ఆ ఆవేశం తనలో ఉందని నమ్మించేవారు. కానీ ఇప్పుడు అందరికీ వస్తున్న సందేహం ఏమింటే… చే జీవితం గురించి పవన్ కల్యాణ్ చదవలేదని..అర్థం చేసుకోలేదని. ఎందుకంటే.. కేవలం ఆయన హావభావాలు ఉన్న ఫోటోలు.. డ్రెస్సింగ్ స్టైల్.. నోట్లో చుట్ట పెట్టుకోవడం వంటి వాటికి ఆకర్షితుడై … చే అభిమానిగా మారిపోయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఆయన భావజాలంలో మాత్రం.. చే ప్రభావం లేకుండా పోవడం దీనికి మరో నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

మత రాజకీయాలు ప్రజలు ఎలా మేలు చేస్తాయో ఏ పుస్తకంలో అయినా ఉందా..?

హిందూ ధర్మం కోసం దీక్ష చేసిన పవన్ కల్యాణ్ పనిలో పనిగా కొన్ని పుస్తకాలు తీసుకు వచ్చి ఫోటో షూట్ చేయించుకున్నారు. అందులో ఉన్న పుస్తకాల పేర్లు చూసి.. మేధావులకు సౌండ్ పోయింది. ఎందుకంటే… ఆ పుస్తకాలు చదివిన .. అర్థం చేసుకున్న వారందరూ… సంస్కృతి గురించి… సంప్రదాయాల గురించి.. సనాతన ధర్మాల గురించి… సమాజంతో వ్యవహరించాల్సిన పద్దతులపై ఓ అవగాహనకు వస్తారు. రాజకీయం చేసుకోవచ్చని.. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవచ్చని అందులో చెప్పలేదు. కానీ పవన్ కల్యాణ్‌కు అలాగే అర్థమయింది. అలాగే చేస్తున్నారు. చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్లుగా ఇలాంటి పుస్తకాలన్నీ చదివేసి.. తాను అనుకున్నదే అందులో ఉందనుకుని… ముందుకెళ్తున్నారు పవన్.

అయితే.. పుస్తకాల్లో ఉన్న వాటికి .. తాను చదివిన దానికి..తనకు అర్థమైనంత వరకూ.. నిజమని నమ్మవచ్చు తప్పు లేదు కానీ.. ఆ పుస్తకాలతో ఫోటో షూట్ల వల్లే సమస్య వస్తోంది. వాటిని చదువుతున్నానని.. ఫోటోలు తీయించుకుని మేధావిలా ఫోజులు కొడితే ఆ ఇమేజ్ రాదు… ప్రవర్తనలో.. ఆలోచనల్లో..ఆ మేధావితనం రావాలి. ఆ పుస్తకాలను నిజంగానే చదివి అర్థం చేసుకున్నానని ప్రజలకు..తన నిర్ణయాలు.. పోరాటాలు.. ఆలోచనలతోనే నిరూపించాలి. లేకపోతే.. కామెడీ అయిపోతారు. ఇప్పుడదే జరుగుతోంది. గుర్తిస్తారో లేదో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : టీవీ9 నుంచి రజనీకాంత్ ఔట్

టీవీ9 నుంచి రజనీకాంత్ నిష్క్రమించారు. తెలుగులో నెంబర్ వన్ చానల్‌గా ఉన్న టీవీ9లో కొద్దిరోజులుగా గ్రూపుల గలాటా సాగుతోంది.రజనీకాంత్, మురళీకృష్ణల మధ్య సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయారు. కొత్త యాజమాన్యం చేతుల్లోకి వచ్చిన...

అమరావతికి మద్దతుగా హైకోర్టులో జనసేన అఫిడవిట్..!

అమరావతి విషయంలో జనసేన పార్టీ తన విధానాన్ని నేరుగా హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో తెలియ చేసింది. మూడు రాజధానులు వద్దే వద్దని అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని సూటిగా జనసేన స్పష్టం చేసింది....

బ్యాటన్ అందుకున్న రోజా ..! పెద్ద ప్లానే..!?

హిందూత్వాన్ని కించ పరుస్తున్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు మాత్రం తగ్గడం లేదు. వివాదాన్ని అంతకంతకూ పెద్దగి చేసుకుంటూ వెళ్తున్నారు అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలతో ఒకరిని మించి మరొకరు...

మోడీ భార్యతో కలిసి పూజలు చేసిన తర్వాతే జగన్‌ను అడగాలి : కొడాలి నాని

భారతీయ జనతా పార్టీపైనా మంత్రి కొడాలి నాని తన టెంపర్ చూపించారు. ప్రధాని మోడీ ముందు తన భార్యను రామాలయనికి తీసుకెళ్లి సతీసమేతంగా పూజలు చేయాలని ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి కుటుంబసమేతంగా...

HOT NEWS

[X] Close
[X] Close