లడ్డూ కల్తీపై పవన్ కల్యాణ్ మరోసారి బావోద్వేగంగా స్పందించారు. వారు మన నమ్మకాన్ని విచ్చిన్నం చేశారని భావోద్వేగంతో ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఐదేళ్ల కాలంలో సగానికి పైగా భక్తులు ఇచ్చిన లడ్లూ నెయ్యి కాని నెయ్యితో తయారు చేశారని సిట్ గుర్తించింది. ఈ అంశంపై మీడియాలో వచ్చిన కథనాన్ని షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తన ఆవేదన వ్యక్తం చేసారు.
మన తిరుమల కేవలం ఆలయం కాదు అది మన భక్తికి మూలం. గత ప్రభుత్వ హయాంలో (2019–24) అంచనా ప్రకారం 10.97 కోట్ల మంది మీరు..మీ బంధువులు.. తనతో సహా అందరూ తిరుమల ఆలయానికి వెళ్లామన్నారు. ప్రతిరోజూ 60,000 మంది భక్తులు సామాన్యుడి నుండి భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు ప్రధాన న్యాయమూర్తితో సహా అత్యున్నత రాజ్యాంగ ప్రముఖుల వరకు వెళ్లారన్నారు. మనం ఎంతో భక్తి భావంతో వెళ్తే.. మునుపటి TTD బోర్డు , అధికారులు మన హృదయాలను విచ్ఛిన్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు మన భక్తికి ద్రోహం చేశారు.. ప్రతి ఒక్క భక్తుడు మోసపోయాడు. వారు నియమాలను ఉల్లంఘించలేదు మనం వారిపై ఉంచిన పవిత్ర నమ్మకాన్ని వారు విచ్ఛిన్నం చేశారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ ట్వీట్ సోషల్ మీడియాలో వరైల్ అవుతోంది. ఇంత ఘోరంగా కల్తీ చేసి.. మళ్లీ అందులో అది కల్తీ కాలేదు.. ఇది కల్తీ కాలేదని కబుర్లు చెబుతున్నారు. ఎన్డీడీబీ నివేదిక ప్రకారం అందులో జంతువుల కొవ్వు కలిపారు. సిట్ దర్యాప్తులో ఏమేమి కలిపారో మొత్తం బయటకు వస్తుంది. అయితే అంబటి రాంబాబు డైవర్షన్ గేమ్ ఆడేందుకు పవన్ కు కౌంటర్ గా ఇంగ్లిష్ లో భారీ ట్వీట్లు పెడుతున్నారు.