ఏపీలో రప్పా రప్పా నరికేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వారి సంగతి చూడటానికి తమకు రెండు రోజులు చాలని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాజకీయ నిర్ణయం తీసుకంటే చాలని అన్నారు. తాడేపల్లిగూడెంలోని పెరవలిలో అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రసంగించారు. రౌడీయిజం చేస్తున్న వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఇలాంటి వాటి ఆట కట్టించేందుకు తమకు రెండు రోజుల సమయం చాలని అన్నారు. ఇలాంటి వారికి సీఎం యోగీ ఇచ్చే ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అవుతారని హెచ్చరికలు జారీ చేశారు.
పిఠాపురంలో చిన్ని పిల్లలను కూడా చూపించి కుల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఇంకా బరితెగించి జైల్లో పెడతామంటూ కాంట్రాక్టర్లను ఇతరులను బెదిరిస్తున్నారని మండిడ్డారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని ..అధికారంలో ఉన్నప్పుడే తమను ఏం పీకలేకపోయారని ఇకపై ఏం చేస్తారని అన్నారు. తాను ఎప్పుడు బయటకు వచ్చినా ఇంటికి వెళ్తానో లేదో అనే ఆలోచనతో ఉంటానని ప్రకటించారు. అందుకే తనకు భయం లేదన్నారు. ఎన్ని విమర్శలైనా సమాధానం చెబుతామని..కానీ హద్దు దాటే వారికి గట్టి ట్రీట్మెంట్ ఇస్తామని స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో వైసీపీ నేతల బెదిరింపులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఏమీ అనడం లేదని తాము రాగానే చంపేస్తామని బెదిరించేవారి సంఖ్య పెరిగిపోతోంది. చంపాలంటే మీరు రావాలికానీ.. తాము ఇప్పుడు అధికారంలో ఉన్నామని తాము తల్చుకుంటే ఎంత సేపని కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ నేతలు తీరుమార్చుకోకపోతే.. ప్రభుత్వం కఠినంగా ఉండే అవకాశాలు ఉన్నాయని పవన్ కల్యాణ్ మాటలతో స్పష్టమవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.