ప‌వ‌న్ తో క్రిష్‌… ముహూర్తం ఫిక్స్‌

పింక్ రీమేక్‌తో మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇంత‌లోనే మ‌రో సినిమాకీ ప‌చ్చ జెండా ఊపేశాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకీ ముహూర్తం ఫిక్స‌యిపోయింది. ఈనెల 27న క్రిష్ సినిమాకి కొబ్బ‌రి కాయ కొట్ట‌నున్నారు. ఫిబ్ర‌వ‌రిలో గానీ, మార్చిలోగానీ చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతుంది. ఏ.ఎం.ర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు.మ‌హమ్మ‌దీయుల ప‌రిపాల‌నా కాలం నాటి క‌థ ఇది. అప్ప‌టి క‌ట్ట‌డాల‌ని పోలిన సెట్స్‌ని రూపొందించాల్సివుంది. అందుకు సంబంధించిన ప‌నులు మొద‌ల‌య్యాయి కూడా. ఈలోగా న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల ఎంపిక కోసం క్రిష్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇందులో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు చోటుంది. అందుకోసం బాలీవుడ్ క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీలిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. అందుకే వివిధ భాష‌ల నుంచి న‌టీన‌టుల్ని ఎంచుకునే ప‌నిలో ఉంది చిత్ర‌బృందం. ప్ర‌తినాయ‌కుడి పాత్ర కోసం కూడా బాలీవుడ్ న‌టుల పేర్లు ప‌రిశీలిస్తున్నారు. బుర్రా సాయిమాధ‌వ్ ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు అందిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close