మళ్ళీ జూలు విదిల్చిన పవన్: కాంగ్రెస్‌పై ట్వీట్‌లు

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ట్వీట్లు మొదలెట్టారు. గతవారం కేశినానిపై, సీమాంధ్ర టీడీపీ ఎంపీలపై ట్వీట్ల పరంపర కురిపించిన పవన్ ఈసారి కాంగ్రెస్‌పై పడ్డారు. 5 కోట్ల సీమాంధ్ర ప్రజలకు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను పట్టించుకోకుండా లలిత్ మోడి అంశాన్ని పట్టుకుని బీజేపీపై పోరాడుతున్నందుకు కాంగ్రెస్ వారి ఉత్సాహం, కాంక్ష, శ్రధ్ధ తనకు పిచ్చిపిచ్చిగా నచ్చేశాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన ఇంతకుముందు ట్వీట్లలో సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎంపీలను చెండాడిన విషయం తెలిసిందే.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఈనెల 24న అనంతపురంలో పర్యటించటానికి వస్తున్న ఈ సమయంలో పవన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు పవన్ సోదరుడు చిరంజీవికూడా రాహుల్ పర్యటనలో పాల్గొననున్నారని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి నిన్న ప్రకటించారు. అన్నట్లు చిరంజీవికూడా ఏపీ ఎంపీయే కదా(ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు)!  మరి ప్రత్యేకహోదాపై చిరు మౌనంమీద పవన్ ఏమీ మాట్లాడరేం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close