పాయ‌ల్‌కి గోల్డెన్ ఛాన్స్‌?

ఆర్‌.ఎక్స్ 100తో ఒక్క‌సారిగా వెలుగుల‌లోకి వ‌చ్చింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఆ క్యారెక్ట‌ర్ ఇంపాక్టో, పాయ‌ల్ గ్లామ‌ర్ తెలీదో గానీ – ఆ పాత్ర యువ హృద‌యాల మ‌న‌సుల్లో నాటుకు పోయింది. దాంతో పాటు పాయ‌ల్ కి చాలా ఛాన్సులొచ్చాయి. కానీ.. ఏదీ నిల‌బెట్టుకోలేక‌పోయింది. లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌పై దృష్టి పెట్టింది. అక్క‌డా క‌ల‌సి రాలేదు. `వెంకీ మామ‌` హిట్ట‌యినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. ఆసినిమాలో త‌న‌ని మ‌రీ ఆంటీగా చూపించార‌ని వాపోయింది.

ఇప్పుడు పాయ‌ల్‌కి ఓ గోల్డెన్ ఛాన్స్ ద‌క్కింది. త్వ‌ర‌లోనే… క‌మ‌ల్ హాస‌న్ సినిమాలో ఐటెమ్ గీతంలో న‌ర్తించ‌బోతోంద‌ట‌. క‌మ‌ల్ – శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `ఇండియ‌న్ 2`. కాజ‌ల్ క‌థానాయిక‌. ఇందులో ఓ ప్ర‌త్యేక గీతం ఉంద‌ని, ఆ పాట‌లో పాయ‌ల్ క‌నిపిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అదే నిజ‌మైతే ఈ పాట‌తో పాయ‌ల్ ద‌శ తిరిగిన‌ట్టే. శంక‌ర్ సినిమాల‌న్నీ భారీగా ఉంటాయి. పైగా పాట‌లు తెర‌కెక్కించ‌డంలో ఆయ‌న దిట్ట‌. శంక‌ర్ సినిమాలో ఒక్క పాట‌లో క‌నిపించినా – ఆ క్రేజ్ మామూలుగా ఉండ‌దు. పైగా ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు. అందుకే… పాయ‌ల్ జాత‌కం ఈ సినిమాతో మార‌డం గ్యారెంటీ అనిపిస్తోంది. పాయ‌ల్ ఎంపిక దాదాపు లాంఛ‌నమే అని తెలుస్తోంది. శంక‌ర్ – క‌మ‌ల్ మ‌దిలో మ‌రో క‌థానాయిక త‌గిలితే చెప్ప‌లేం గానీ, అంత వ‌ర‌కూ పాయ‌ల్‌నే ప్ర‌ధాన ఆప్ష‌న్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ దళిత రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే..!

నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.....

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close